Bigg Boss Telugu 7: హౌస్లో కలుపు మొక్కలు ఎవరు... నాగార్జున షాకింగ్ క్వశ్చన్, శివాజీ ఎవరి పేరు చెప్పాడు!

Published : Sep 24, 2023, 03:05 PM IST
Bigg Boss Telugu 7: హౌస్లో కలుపు మొక్కలు ఎవరు... నాగార్జున షాకింగ్ క్వశ్చన్, శివాజీ ఎవరి పేరు చెప్పాడు!

సారాంశం

బిగ్ బాస్ షో మూడో వీకెండ్ కి దగ్గరైంది. హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చాడు. ఆదివారం ఎపిసోడ్ ఆయన ఆధ్వర్యంలో ఆసక్తికరంగా సాగింది.   


బిగ్ బాస్ తెలుగు 7 ఆసక్తికరంగా సాగుతుంది. మూడో వీకెండ్ రాగా నాగార్జున ఎంట్రీ ఇచ్చాడు. ఆయన ఓ సరదా గేమ్ కండక్ట్ చేశాడు. రంగులతో కూడిన బోర్డు ఉంటుంది. అందులో ఉన్న ముల్లును హౌస్ మేట్స్ తిప్పాలి. వచ్చిన రంగు ఆధారంగా నాగార్జున ప్రశ్నలు అడుగుతారు. శివాజీని ఇంట్లో కలుపు మొక్కలు ఎవరని అడుగుతాడు నాగార్జున. ఆయన కొందరి పేర్లు చెప్పాడు. 

రతికాపై సున్నితంగా సెటైర్ వేశాడు నాగార్జున. ఆమె రంగుల విషయంలో కన్ఫ్యూస్ అవుతుంది అన్నాడు. దాని వెనుక మీనింగ్ గమనిస్తే... రైతు బిడ్డ నల్లగా, ప్రిన్స్ యావర్ తెల్లగా ఉన్నాడు. ఇద్దరితో సన్నిహితంగా ఉంటుంది. ఆమె ఇద్దరిలో ఎవరితో కనెక్ట్ అవ్వాలో తికమక పడుతుందని నాగార్జున సెటైర్ వేశాడు. నిజానికి రతికా ఎవరికీ కనెక్ట్ కాదు. ఆమె కంటెస్టెంట్స్ ని జస్ట్ వాడుకుంటుందని సోషల్ మీడియా టాక్. 

ఇక ఈ వారం ఏడుగురు ఎలిమినేషన్ లిస్ట్ లో ఉన్నారు. వారిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు. అమర్ దీప్, ప్రియాంక, ప్రిన్స్ యావర్, శుభశ్రీ, గౌతమ్ కృష్ణ, దామిని, రతికా రోజ్ నామినేట్ కాగా దామినికి అతి తక్కువ ఓట్లు వచ్చాయని సమాచారం. ఆమె ఈ వారం ఎలిమినేట్ కానుందట. 
 

PREV
Read more Articles on
click me!