ఓల్డేజ్‌ హోమ్‌లో దిగ్గజ దర్శకుడు కన్నుమూత..

Published : Sep 24, 2023, 01:38 PM IST
ఓల్డేజ్‌ హోమ్‌లో దిగ్గజ దర్శకుడు కన్నుమూత..

సారాంశం

చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దిగ్గజ దర్శకుడు కన్నుమూశారు. మలయాళ చిత్ర పరిశ్రమని కొత్త పుంతలు తొక్కించిన గ్రేట్‌ డైరెక్టర్‌ కేజీ జార్జ్ (77) ఆదివారం తుదిశ్వాస విడిచారు.

చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దిగ్గజ దర్శకుడు కన్నుమూశారు. మలయాళ చిత్ర పరిశ్రమని కొత్త పుంతలు తొక్కించిన గ్రేట్‌ డైరెక్టర్‌ కేజీ జార్జ్ (77) ఆదివారం తుదిశ్వాస విడిచారు. అనారోగ్య కారణాలతో ఆయన మరణించినట్టు మలయాళ మీడియా వెల్లడించింది. అయితే ఆయన కక్కనాడ్‌ ఓల్డేజ్‌ హోమ్‌లో ఆదివారం మరణించడం బాధాకరం. ఎన్నో గొప్ప సినిమాలు చేసి స్టార్‌ డైరెక్టర్‌గా రాణించిన ఆయన ఓల్డేజ్‌ హోమ్‌లో మరణించడం అత్యంత బాధాకరం. 

దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు మలయాళ చిత్ర పరిశ్రమకి విశేష సేవలందించారు దర్శకుడు కేజీ జార్జ్. ఆయన ఎక్కువగా మమ్ముట్టితో సినిమాలు రూపొందించారు. సుకుమారన్‌, శారదల వంటి వారితోనూ ఎక్కువ సినిమాలు చేశారు. కుటుంబ అనుబంధాలు ప్రధానంగా ఆయన చిత్రాలు తెరకెక్కించి అనేక విజయాలు అందుకున్నారు. 1972లో `మాయ` అనే చిత్రంలో ఆయన అసోసియేట్‌ డైరెక్టర్‌గా కెరీర్‌ని ప్రారంభించారు. 

ఆ తర్వాత `నీలు` సినిమాతో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా మారారు. దీనికి ఆయనే స్క్రీన్‌ప్లే అందించడం విశేషం. 1976లో వచ్చిన `స్వప్నదానం` చిత్రంతో ఆయన దర్శకుడిగా మలయాళ చిత్ర పరిశ్రమకి పరిచయం అయ్యారు. దాదాపు 20 సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇందులో మమ్ముట్టి నటించిన `మేళ`, `యవనిక`, `కథక్కు పిన్నిల్`, `మట్టోరల్‌` చిత్రాలు నిర్మించారు.

వీటితోపాటు `ఐలవంకోట్‌ దేశం`, `పంచవాడి పాలం`, `ఇరకల్‌`, `ఆడామింటే వారియెల్లే`, `లెఖయుడ్‌ మరణం` వంటి చిత్రాలు రూపొందించారు. ఆయన సినిమాల్లో ఫ్యామిలీ ఎమోషన్స్ మాత్రమే కాదు, మహిళా సాధికారత, సమాజంలో అణచివేత, దోపిడి వంటి అంశాలను కూడా ప్రస్తావించారు. పలు పొలిటికల్‌ డ్రామాలను, కాంట్రవర్షియల్‌ మూవీస్‌ని కూడా రూపొందించారు. ఓ రకంగా సమాజంలో మార్పుకి తనవంతు సినిమాతో సేవలందించారు. అందుకే కేజీ జార్జ్ మలయాళ చిత్ర పరిశ్రమ ఓ పెద్దగా భావిస్తుంది. 

దీంతోపాటు ఆయన రూపొందించిన చిత్రాలకు కేరళా స్టేట్‌ అవార్డులు వరించాయి. విశేష ప్రశంలందుకున్నాయి. మలయాళ చిత్ర పరిశ్రమని ప్రభావితం చేసిన దర్శకుడిగా పేరుతెచ్చుకున్నారు.దీంతోపాటు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కూడా ఆయన కృషి చేశారు. టెక్నీషియన్ల కోసం మలయాళం సినీ టెక్నీషియన్స అసోసియేషన్‌ని స్థాపించడంలో ముఖ్య పాత్ర పోషించారు. ఫౌండర్‌, ఛైర్మెన్‌గా వ్యవహరించారు.

కేరళాలో 1945 మే 24న జన్మించిన కేజీ జార్జ్.. పొలిటికల్‌ సైన్స్ లో గ్రాడ్యుయేట్‌ చేశారు. ఆ తర్వాత పూణే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో ఫిల్మ్ డైరెక్టింగ్‌ చేశారు. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చారు. కేజీ జార్జ్ మరణం పట్ల మాలీవుడ్‌ సంతాపం తెలియజేస్తుంది. ఆయన మరణం చిత్ర పరిశ్రమకి తీరని లోటని, ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన లెగసీ కంటిన్యూ అవుతుందని, ఎప్పటికీ సినిమాలతో ఆయన గుర్తిండిపోతారని కొనియాడుతూ నివాళ్లు అర్పిస్తున్నారు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: చివరి రోజు ఓటింగ్‌ తలక్రిందులు, పక్కా ప్లాన్‌ ప్రకారమే.. టాప్‌లో ఉన్నదెవరంటే?
Karthika Deepam 2 Today Episode: దీప, కార్తీక్ లపై రెచ్చిపోయిన పారు, జ్యో- శ్రీధర్ పదవి పోయినట్లేనా?