Bigg Boss Telugu 7: రతిక వర్సెస్ అమర్: బయట నీ ముఖాన ఊస్తున్నారు, మాటలు జాగ్రత్తగా రాని!

By Sambi Reddy  |  First Published Nov 2, 2023, 11:38 PM IST


బిగ్ బాస్ హౌస్లో రతిక రోజ్, అమర్ దీప్ మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. రతికపై అమర్ పరుష వ్యాఖ్యలు చేశాడు. దాంతో ఆమె సీరియస్ అయ్యింది. 
 


బిగ్ బాస్ హౌస్లో కెప్టెన్సీ టాస్క్ నడుస్తుంది. ఇంటి సభ్యులను బిగ్ బాస్ రెండు టీమ్స్ గా విభజించాడు. వీర సింహాలు టీమ్ లో రతిక, గౌతమ్, శోభా, భోలే, యావర్, తేజ ఉన్నారు. ఇక గర్జించే పులులు టీమ్ లో శివాజీ, పల్లవి ప్రశాంత్, ప్రియాంక, అశ్విని, అర్జున్, అమర్ ఉన్నారు. వీరు సమయానుసారంగా పైపు నుండి పడే బంతులను సేకరించాలి. ఇరు టీమ్ సభ్యులు సంచుల్లో వాటిని నింపి ప్రత్యర్థుల నుండి కాపాడుకోవాలి. 

అదే సమయంలో బిగ్ బాస్ నిర్వహించే టాస్క్స్ లో పాల్గొనాలి. జంపింగ్ జపాంగ్ టాస్క్ లో వీర సింహాలు టీమ్ గెలిచింది. దాంతో గర్జించే పులులు టీమ్ నుండి ఒకరిని తప్పించే ఛాన్స్ వారికి దక్కింది. వారు పల్లవి ప్రశాంత్ ని తప్పించారు. దాంతో గర్జించే పులులు టీమ్ వీక్ అయ్యింది. నేటి ఎపిసోడ్లో మరలా బంతులు పడ్డాయి. సేకరించించేకు ఇరు టీమ్స్ కి సంచులు కావాల్సి వచ్చాయి. ముందుగా స్టోర్ రూమ్ లోకి వెళ్లిన అమర్ ప్రత్యర్థి టీమ్ సంచులు కూడా తీసుకున్నాడు. దాంతో గౌతమ్ ప్రతిఘటించాడు. 

Latest Videos

సంచుల విషయంలో రతిక-అమర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సంచులు ఎందుకు క్రింద పడేశావ్ అని రతిక అమర్ ని ప్రశ్నించింది. అది నా ఇష్టం నా స్ట్రాటజీ  అన్నాడు. ఎదవ పని చేసి స్ట్రాటజీ అనకు అని రతిక అన్నది. నువ్వు చేసేవి ఎదవ పనులు, నువ్వంటే ఊస్తున్నారు బయట అని అమర్ అన్నాడు. మాటలు జాగ్రత్తగా రానీ అని రతిక హెచ్చరించింది. అమర్ కూడా తగ్గలేదు. ఇద్దరి మధ్య గొడవ పర్సనల్ వరకూ వెళ్ళింది. 

అనంతరం బిగ్ బాస్ 'బ్రేక్ ఇట్ ఎయిమ్ లో' అనే టాస్క్ పెట్టాడు. బాక్స్ బద్దలు చేసి అందులో ఉన్న సంచి తీసుకోవాలి. సంచిలో ఉన్న కర్రలను పైనుండి గురి చూసి గొట్టాల్లో పడేలా వేయాలి. ఇరు టీమ్స్ నుండి ఏక కాలంలో ఇద్దరు ఈ గేమ్ ఆడాలి. ముందుగా టాస్క్ పూర్తి చేసినవారు విన్నర్ అవుతారు. గర్జించే పులులు నుండి అర్జున్, అమర్... వీర సింహాలు నుండి శోభా, గౌతమ్ ఈ గేమ్ ఆడారు. 

ముందుగా గర్జించే పులులు టీమ్ టాస్క్ పూర్తి చేసి విన్నర్ అయ్యారు. దీంతో బిగ్ బాస్ వాళ్లకు ఓ పవర్ ఇచ్చారు. అది ఉపయోగించి వీరసింహాలు టీమ్లోని ఒకరిని డెడ్ చేయవచ్చు లేదా వారి నుండి 500 బాల్స్ తీసుకోవచ్చు. గర్జించే పులులు టీమ్ 500 బాల్స్ తీసుకునే ఆప్షన్ ఎంచుకున్నారు. అనంతరం మరలా పైనుండి బాల్స్ పడ్డాయి. కంటెస్టెంట్స్ సేకరించేందుకు పోటీపడ్డారు. 

గోల్డెన్ బాల్ ఎవరి వద్ద ఉందని బిగ్ బాస్ అడిగాడు. గోల్డెన్ బాల్ వీర సింహాలు టీమ్ వద్ద ఉంది. దాంతో వాళ్లకు మరో పవర్ దక్కింది. తమ టీమ్ లోని వీక్ ప్లేయర్ ని ప్రత్యర్థి టీమ్ లోని ప్లేయర్ తో మార్పిడి చేసుకోవచ్చు అన్నారు. దాంతో వీర సింహాలు టీమ్ భోలేని అటు పంపి గర్జించే పులులు టీమ్ నుండి అర్జున్ ని తీసుకున్నారు. శివాజీ తన బంతులు తీసుకుంటే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చాడు. తేజ ఇది కూడా ఆటలో భాగమే అన్నాడు. రాత్రివేళ గర్జించే పులులు టీమ్ దగ్గర ఉన్న బాల్స్ ని వీర సింహాలు టీమ్ దొంగిలించే ప్రయత్నం చేశారు.. 
 

click me!