Bigg Boss Telugu 7: బిగ్ హౌస్లో కీలకంగా మారిన మాయాస్త్ర... రెండుగా విడిపోయిన సభ్యులు!

Published : Sep 12, 2023, 05:31 PM IST
Bigg Boss Telugu 7: బిగ్ హౌస్లో కీలకంగా మారిన మాయాస్త్ర... రెండుగా విడిపోయిన సభ్యులు!

సారాంశం

మాయాస్త్ర సంపాదించినవారికి పవర్ అస్త్ర దక్కుతుందని బిగ్ బాస్ చెప్పడంతో కంటెస్టెంట్స్ శక్తివంచన లేకుండా పోరాడుతున్నారు. మయాస్త్ర గెలిచిన టీమ్ సభ్యుల్లో ఒకరికి పవర్ అస్త్ర పొందే ఛాన్స్ ఉంటుంది. 

బిగ్ బాస్ సీజన్ 7లో టాస్క్ మొదలయ్యాయి. ఇంటి సభ్యులను రెండు టీమ్స్ గా విభజించి టాస్క్స్ కండక్ట్ చేస్తున్నారు. మాయాస్త్ర కోసం కంటెస్టెంట్స్ కష్టపడుతున్నారు.మాయాస్త్ర సంపాదించినవారికి పవర్ అస్త్ర దక్కుతుందని బిగ్ బాస్ చెప్పడంతో కంటెస్టెంట్స్ శక్తివంచన లేకుండా పోరాడుతున్నారు. అమర్ దీప్, ప్రిన్స్ యావర్, షకీలా, శివాజీ, శోభా శెట్టి, ప్రియాంకతో కూడిన 6 సభ్యులను ఒక టీమ్ గా ప్రకటించారు. ఈ సమూహానికి రణధీర అని పేరు పెట్టారు. 

మిగిలిన గౌతమ్ కృష్ణ, తేజా, రతికా రోజ్, దామిని, పల్లవి ప్రశాంత్, శుభశ్రీ ఒక టీమ్ గా ఏర్పడ్డారు. ఈ టీమ్ కి మహాబలి అని పేరు పెట్టారు. ఆల్రెడీ పవర్ అస్త్ర గెలిచిన ఆట సందీప్ ని సంచాలకుడిగా వ్యవహరించాలని బిగ్ బాస్ ఆదేశించాడు. ఈ రెండు టీమ్స్ టాస్క్స్ లో పోటీపడి మాయాస్త్ర గెలుచుకోవాలి. మయాస్త్ర గెలిచిన టీమ్ సభ్యుల్లో ఒకరికి పవర్ అస్త్ర పొందే ఛాన్స్ ఉంటుంది. 

రణధీర్-మహాబలి మధ్య మొదటి టాస్క్ గా ఫుల్ రాజా ఫుల్ పెట్టారు. టగ్ ఆఫ్ వార్ మాదిరి... ఇరువైపులా ఉన్న ప్రత్యర్థి టీమ్ సభ్యులు మధ్యలో కట్టిన కర్రను తమవైపుకు లాగాలి. ఈ టాస్క్ నిర్వహించారు. ఇక బిగ్ బాస్ మొత్తంగా నిర్వహించిన టాస్క్స్ లో రణధీర-మహాబలి ఎవరు గొప్పగా ఆడితే వాళ్లకు మయాస్త్ర కనబడుతుంది. ఆ గెలిచిన టీమ్ సభ్యుల్లో ఒకరు పవర్ అస్త్ర గెలుచుకునే అవకాశం ఉంటుంది. 

ఆల్రెడీ పవర్ అస్త్ర గెలిచిన ఆట సందీప్ 5 వారాల ఇమ్యూనిటీ పొందాడు. ఈ ఐదు వారాలు అతన్ని ఎవరూ నామినేట్ చేయడానికి వీల్లేదు. అలాగే రెండో పవర్ అస్త్ర గెలుచుకున్న కంటెస్టెంట్ కి ఇదే బెనిఫిట్స్ వర్తించే అవకాశం ఉంది. 2వ వారం 7 మంది కంటెస్టెంట్స్ నామిషన్స్ లో ఉన్నారట. ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్, రతికా రోజ్, శోభా శెట్టి, అమర్ దీప్ చౌదరి, శివాజీ, టేస్టీ తేజలు నామినేషన్స్ లో ఉన్నారట. ఫస్ట్ వీక్ నామినేషన్ లో లేని శివాజీ, అమర్ దీప్ చౌదరి, తేజా నామినేషన్స్ లోకి వచ్చారు. శివాజీ, అమర్ దీప్ టాప్ సెలెబ్స్ కాగా షాకింగ్ ఎలిమినేషన్ ఉండే అవకాశం లేకపోలేదు
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ప్రోమోతోనే దుమ్ములేపుతున్న `దేఖ్‌ లేంగే సాలా` సాంగ్‌.. పవన్‌ కళ్యాణ్‌ మేనియా స్టార్ట్
2025 Top 5 Heroes: 1000 కోట్లతో టాప్‌లో ఉన్న నటుడు ఇతనే.. రిషబ్‌, మోహన్‌ లాల్‌, విక్కీ, అక్షయ్‌లకు ఝలక్‌