డబుల్ ఎలిమినేషన్ అంటూ బిగ్ బాస్ షాక్ ఇచ్చాడు. అయితే చిన్న ట్విస్ట్ ఇచ్చాడు. శుభశ్రీ ఇంటికి పోగా మరో కంటెస్టెంట్ సీక్రెట్ రూమ్ కి వెళ్ళాడు.
బిగ్ బాస్ తెలుగు 7 సెకండ్ లాంచ్ ఈవెంట్ డే ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎపిసోడ్ ఎలిమినేషన్ తో మొదలైంది. నామినేషన్స్ లో ఉన్న ఏడుగురిని నాగార్జున డార్క్ రూమ్ కి పంపాడు. ఆ రూమ్ నుండి ఎలిమినేటైన శుభశ్రీని దెయ్యం తీసుకుపోయింది. నాగార్జున శుభశ్రీని వేదికపైకి ఆహ్వానించాడు. ఆమె ఇంటి సభ్యులతో గుడ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ చెప్పి వేదిక వీడింది. అయితే నామినేషన్స్ లో మరో ఆరుగురు కంటెస్టెంట్స్ నుండి ఒకరు ఎలిమినేట్ అవుతారని నాగార్జున చెప్పాడు.
ఆడియన్స్ ఓట్ల ఆధారంగా ప్రియాంక, శివాజీ, యావర్, అమర్ దీప్ వరుసగా సేవ్ అయ్యారు. ఇక గౌతమ్-తేజాలలో ఒకరు ఎలిమినేట్ అవుతారని నాగార్జున చెప్పాడు. సేవ్ అయిన నలుగురితో పాటు సందీప్, పల్లవి ప్రశాంత్, శోభా శెట్టి హౌస్ మేట్స్ అయ్యారు. గౌతమ్-తేజాలలో ఎవరు ఎలిమినేట్ అవ్వాలనేది ఈ ఏడుగురు హౌస్ మేట్స్ నిర్ణయిస్తారని చెప్పి షాక్ ఇచ్చాడు. గౌతమ్-తేజా ల ఎదుట రెండు గ్లాస్ కంటైనర్స్ ఉంటాయి. హౌస్ మేట్స్ ఇంటి నుండి వెళ్లిపోవాలని కోరుకుంటున్న కంటెస్టెంట్ కంటైనర్ లో రెడ్ లిక్విడ్ పోయాలి.
ఒక్క సందీప్ మాత్రమే గౌతమ్ ఇంట్లో ఉండాలని తేజా కంటైనర్ లో లిక్విడ్ పోశాడు. మిగతా ఆరుగురు హౌస్ మేట్స్ తేజా ఇంట్లో ఉండాలని గౌతమ్ కంటైనర్ లో రెడ్ లిక్విడ్ పోశారు. దాంతో గౌతమ్ ఎలిమినేట్ అయ్యాడు. నాగార్జున గౌతమ్ ని వేదికపైకి ఆహ్వానించారు. ఇంట్లో ఉన్న 8 మంది హౌస్ మేట్స్ లో ఫేక్ ఎవరు? రియల్ ఎవరో చెప్పాలని గౌతమ్ ని నాగార్జున అడిగారు. తేజా, యావర్ తప్పితే అందరిలో ఫేక్ నెస్ ఉందని చెప్పాడు.
అనంతరం ఇంటికి వెళ్ళిపో అని చెప్పిన నాగార్జున గౌతమ్ ని వెనక్కి పిలిచి ట్విస్ట్ ఇచ్చాడు. నువ్వు ఎలిమినేట్ కాలేదు. నీకు సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాను. నువ్వు ఇప్పుడు సీక్రెట్ రూమ్ కి వెళుతున్నావు. అక్కడ ఎలా ఉండాలి? ఏం చేయాలి? అనేది బిగ్ బాస్ చెబుతాడు, అన్నాడు. నాగార్జున మాటలకు గౌతమ్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. గౌతమ్ సీక్రెట్ రూమ్ కి వెళ్ళాడు.