Bigg Boss Telugu 7: అనూహ్యంగా శివాజీని బయటకు పంపేసిన బిగ్ బాస్... ఊహించని ట్విస్ట్!

టైటిల్ ఫెవరేట్స్ లో కఒకరిగా ఉన్న శివాజీని బిగ్ బాస్ బయటకు పంపాడు. ఈ పరిణామం షాక్ కి గురి చేసింది. 
 

bigg boss telugu 7 contestant shivaji out of the show ksr

ఈ వారం నయని పావని ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఉత్కంఠ మధ్య ఆమె ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించాడు. నయని ఏడుస్తూ ఇంటిని వీడింది. వేదిక మీద శివాజీ గురించి ఎమోషనల్ అయ్యింది. ఆమె బదులు నేను ఎలిమినేట్ అవుతానని శివాజీ అన్నాడు. అయితే ఎవరు బయటకు వెళ్లాలో ప్రేక్షకులు నిర్ణయిస్తారని నాగార్జున చెప్పారు. 

కాగా ఏం జరిగిందో తెలియదు కానీ శివాజీని బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ కి పిలిచాడు. ఇంటి నుండి బయటకు వెళ్లిపోవాలని ఆదేశించాడు. ఓకే బిగ్ బాస్ అంటూ శివాజీ బయటకు వచ్చేశాడు. తోటి కంటెస్టెంట్స్ అతన్ని ఆపే ప్రయత్నం చేశారు. అయినా శివాజీ వినలేదు. డోర్స్ తెరుచుకోగా శివాజీ బయటకు వచ్చేశాడు. శివాజీ ఇంటిని వీడటం వెనుక కారణం ఏమిటో తెలియలేదు. లేటెస్ట్ ప్రోమోలో ఈ పరిణామం చోటు చేసుకుంది. 

Latest Videos

మరోవైపు ఎలిమినేట్ అయిన రతికా రోజ్, దామిని, శుభశ్రీలలో ఒకరికి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందని నాగార్జున అన్నారు. ఎవరు బిగ్ బాస్ ఇంట్లోకి రావాలో కంటెస్టెంట్స్ తేల్చుతారని చెప్పాడు. వారు వేసే ఓట్ల ఆధారంగా ఒకరు రీఎంట్రీ ఇస్తారని నాగార్జున చెప్పాడు. అయితే ఎక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళు కాకుండా తక్కువ ఓట్లు వచ్చిన వారు ఇంట్లోకి వస్తారని చెప్పి నాగార్జున షాక్ ఇచ్చాడు. 

He came, he conquered, he left silently 🫡 pic.twitter.com/Gw3i7wbAyb

— Mangalam Srinu (@MangSrinu)
vuukle one pixel image
click me!