
సింగర్ దామిని భట్ల టాప్ సెలెబ్స్ లో ఒకరిగా హౌస్లో అడుగుపెట్టారు. మంచి ప్లేయర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే జనాల్లో ఆమెకు ఆదరణ దక్కలేదు. దీంతో 3వ వారమే హౌస్ వీడారు. దామిని తాజా ఇంటర్వ్యూలో షోపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ ఎవరో ఆమె అంచనా వేశారు. పోటీ శివాజీ, పల్లవి ప్రశాంత్ మధ్యే అని దామిని అన్నారు. శివాజీ వయసులో పెద్దవారు. కూల్ గా మెచ్యూర్డ్ గేమ్ ఆడుతున్నాడు. అయితే టైటిల్ విన్నర్ మాత్రం పల్లవి ప్రశాంత్ అవుతాడు.
పల్లవి ప్రశాంత్ చాలా మంచివాడు. నామినేషన్స్ అప్పుడే అలా ప్రవర్తిస్తాడు. ప్రశాంత్ లో నాకు నచ్చనిది అదే. అతడు కామనర్ గా హౌస్లో అడుగుపెట్టాడు. అతడు రైతుబిడ్డ. ఒక వారం రోజులు ఇంట్లో సెట్ అయ్యేందుకు ఇబ్బందిపడ్డాడు. అతన్ని ఎవరూ తక్కువగా చూడలేదు. అతడికి ఏసీ కూడా పడలేదు. దాంతో జ్వరం వచ్చింది. మేమందరం సేవలు చేశాము అని దామిని అన్నారు.
ఇంకా మాట్లాడుతూ తాను కూడా పీఆర్ టీమ్ ని నియమించుకున్నట్లు దామిని బయటపడ్డారు. అయితే వాళ్లకు నేను క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. నన్ను ఎలివేట్ చేయండి. అంతే కానీ మరొకరి మీద దుష్ప్రచారం చేయవద్దన్నాను. కొన్ని పీఆర్ టీమ్లు కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యుల మీద కూడా అసభ్యకర కామెంట్స్ చేస్తున్నారు. అది సరికాదని దామిని అభిప్రాయ పడింది.
నేను ఎలిమినేట్ అయ్యాక సోషల్ మీడియాలో రతిక-రాహుల్ సిప్లిగంజ్ ఫోటోలు వైరల్ కావడం చూశాను. రాహుల్ నా దగ్గరకు వచ్చాడు. తన వర్షన్ నాతో చెప్పాడు. షోలో రతిక మూడో రోజే నా వద్ద రాహుల్ డిస్కషన్ తెచ్చింది. రాహుల్ నా ఎక్స్ అని చెప్పిందని దామిని ఈ ఇంటర్వ్యూలో అన్నారు. రీ ఎంట్రీ ఛాన్స్ నాకే రావాల్సింది. ప్రియాంక, అమర్, సందీప్, శోభా, నయని పావని, పూజ నాకు ఓట్లు వేశారు. తక్కువ ఓట్లు వచ్చిన రతికను తీసుకోవడంతో రీఎంట్రీ ఛాన్స్ కోల్పోయానని ఆమె అన్నారు.