తారుమారైన ఓటింగ్... సీరియల్ బ్యాచ్ కి షాక్, టాప్ కంటెస్టెంట్ పై ఎలిమినేషన్ కత్తి!

By Sambi Reddy  |  First Published Oct 25, 2023, 9:57 AM IST

నామినేషన్స్ ఎనిమిది మంది ఉన్నారు. మంగళవారం రాత్రి నుండి ఓటింగ్ మొదలైంది. టాప్ కంటెస్టెంట్ డేంజర్ జోన్లో ఉన్నట్లు సమాచారం.


బిగ్ బాస్ షోలో 8వ వారానికి నామినేషన్స్ ముగిశాయి. వాడివేడిగా నామినేషన్స్ ప్రక్రియ కొనసాగింది. ఈ క్రమంలో కొందరు హద్దులు దాటేశారు. ఏకంగా బిగ్ బాస్ హెచ్చరించాల్సి వచ్చింది. నామినేషన్స్ సమయంలో హౌస్ మేట్స్ మాటలు, ఎమోషన్స్ అదుపులో పెట్టుకోవాలి. హద్దులు మీరు ప్రవర్తించ కూడదని చెప్పారు. కెప్టెన్ గా ఉన్న అర్జున్, రీఎంట్రీ ఇచ్చిన రతిక రోజ్ లను నామినేట్ చేయడానికి వీలు లేదని బిగ్ బాస్ ఆదేశించాడు. 

దాంతో ఈ వారానికి శివాజీ, అమర్ దీప్, శోభా శెట్టి, సందీప్, తేజా, ప్రియాంక, భోలే, అశ్విని, గౌతమ్ నామినేట్ అయ్యారు. మంగళవారం నుండి ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. ఓటింగ్ సరళి గమనిస్తే... శివాజీ దూసుకుపోతున్నట్లుగా తెలుస్తుంది. ఆయనకు ఏకంగా 50 శాతం ఓట్లు పోల్ అయ్యాయట. తర్వాత స్థానంలో అనూహ్యంగా భోలే షావలి ఉన్నాడట. భోలేని ఓ బ్యాచ్ టార్గెట్ చేసే కొద్దీ అతనికి సింపతీ పెరుగుతుందని తాజా ఓటింగ్ ద్వారా తెలుస్తుంది. 

Latest Videos

undefined

అమర్ మూడో స్థానంలో, గౌతమ్ కృష్ణ నాలుగో స్థానంలో ఉండగా... ప్రియాంక జైన్ ఐదో స్థానంలో కొనసాగుతుందట. అశ్విని ఆరో స్థానంలో ఉండగా చివరి రెండు స్థానాల్లో శోభా శెట్టి, ఆట సందీప్ కొనసాగుతున్నారట. ఇదే ఓటింగ్ సరళి కొనసాగితే... ఆట సందీప్ ఇంటికి వెళ్లడం ఖాయం. 

ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సందీప్ గత ఏడు వారాల్లో సందీప్ అసలు నామినేషన్స్ లోకి రాలేదు. పవర్ అస్త్ర గెలిచి ఐదు వారాలు ఇమ్యూనిటీ పొందాడు. ఆరు వారం నామినేషన్స్ లోకి రాగా... గౌతమ్ అతన్ని కాపాడాడు. తనకు బిగ్ బాస్ ఇచ్చిన స్పెషల్ పవర్ తో నామినేషన్ నుండి తప్పించాడు. ఏడవ వారం ఒక్కరు మాత్రమే నామినేట్ చేయడంతో బిగ్ బాస్ సింగిల్ ఓట్స్ ని పరిగణ చేయలేదు. మొదటిసారి నామినేట్ అయిన సందీప్ ఇంటి బాట పట్టే అవకాశం ఉంది... 

click me!