Jailer actor Vinayakan: 'జైలర్' విలన్ వినాయక్ అరెస్ట్ ! అసలేం జరిగింది?  

Published : Oct 24, 2023, 11:15 PM IST
Jailer actor Vinayakan: 'జైలర్' విలన్ వినాయక్ అరెస్ట్ ! అసలేం జరిగింది?  

సారాంశం

Jailer actor Vinayakan: 'జైలర్' సినిమాలో విలన్ గా నటించి అందరి ప్రశంసలు పొందిన నటుడు వినాయకన్‌ను కేరళ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. అసలేం జరిగిందంటే..? 

Jailer actor Vinayakan:  సూపర్ స్టార్ నటించిన 'జైలర్' సినిమా గత ఆగస్టులో విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఇందులో మలయాళ నటుడు వినాయకన్ విలన్‌గా నటించారు. ఆయన తన నటనతో సినీ ప్రముఖులు, అభిమానుల మన్ననలను పొందారు. తన నటనతో చిత్రసీమలో తనదైన ముద్ర వేశారు.

కానీ, కేరళ చిత్రసీమలో వినాయకన్‌కు వివాదాలకు కేరాఫ్. సంచలన వ్యాఖ్యలు చేయడం. ఓపెన్ గా తనకు చాలా మంది మహిళలతో పరిచయం ఉందని వినాయకన్ ఒకసారి వేదికపై చెప్పడం ఇలా ఆయనపై పలు వివాదాలు ఉన్నాయి. ఇలాంటి నటుడు వినాయకన్‌ను కేరళ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. అసలేం జరిగిందంటే..?  

వివరాల్లోకెళ్తే.. మంగళవారం నాడు మద్యం మత్తులో ఎర్నాకుళం నార్త్ పోలీస్ స్టేషన్‌లోకి వెళ్లిన వినాయకన్ అక్కడి అధికారిపై దాడి చేసి వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. దీంతో ఎర్నాకుళం నార్త్ పోలీసులు వినాయకన్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసు స్టేషన్‌లో సాధారణ కార్యకలాపాలకు అంతరాయం కలిగించినందుకు అతన్ని అరెస్టు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు.

 ఇక వినాయకన్‌ మద్యం మత్తులో ఉన్నట్లు నిర్ధారించేందుకు వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నటుడు వినాయకుడిని ఎర్నాకుళం నార్త్ పోలీసులు అరెస్ట్ చేసిన వీడియో, ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?