బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ని ఏడిపించేశాడు. ఆయన ఇచ్చి ట్విస్ట్ కి ఒక్కొక్కరు షాక్ అయ్యారు. హౌస్ మొత్తం ఎమోషనల్ గా మారిపోయింది.
ఐదవ వారం బిగ్ బాస్ హౌస్లో కెప్టెన్సీ టాస్క్ నడుస్తుంది. దీనిలో భాగంగా బిగ్ బాస్ ఇంటి సభ్యులను ఇద్దరు చొప్పున జట్లుగా ఏర్పాటు చేశాడు. పల్లవి ప్రశాంత్-శివాజీ, శుభశ్రీ-గౌతమ్, సందీప్-అమర్, ప్రిన్స్ యావర్-తేజ, ప్రియాంక-శోభా టీమ్స్ గా ఏర్పడ్డారు. బిగ్ బాస్ ఒక్కో టాస్క్ నిర్వహిస్తున్నాడు. ఇప్పటికి రెండు టాస్క్స్ కంప్లీట్ అయ్యాయి. మూడో టాస్క్ లో ఎమోషనల్ టచ్ ఇచ్చాడు బిగ్ బాస్.
కంటెస్టెంట్స్ సొంత ఇంటిని, కుటుంబ సభ్యులను వీడి ఐదు వారాలు అవుతుంది. వాళ్ళు ఎలా ఉన్నారో? ఏం చేస్తున్నారో? వీళ్ళకి తెలియదు. ఈ క్రమంలో ఇంటి నుండి వాళ్లకు లెటర్స్ వచ్చాయి. చిట్టీ హాయ్ టాస్క్ లో భాగంగా కుటుంబ సభ్యులు రాసిన లెటర్స్ బిగ్ బాస్ ఓ ఏరియాలో ఉంచాడు. అక్కడకు ఒక్కో జట్టును పంపుతున్నాడు. అయితే ఆ లెటర్స్ ని కంటెస్టెంట్స్ త్యాగం చేయాల్సి ఉంటుంది.
త్యాగం చేసిన వాళ్ళు కెప్టెన్సీ టాస్క్ లో ముందుకు వెళతారు. లేదు ఇంటి సభ్యుల లెటర్ కావాలని తీసుకున్న వాళ్ళు టాస్క్ లో వెనుకబడతారు. ఈ క్రమంలో కొందరు కంటెస్టెంట్స్ కన్నీళ్లు పెట్టుకున్నారు. కెప్టెన్సీ టాస్క్ కోసం లెటర్ వదులుకోవాలా? లేక ఇంటి సభ్యుల యోగక్షేమాలను కనుక్కోవాలా ? అనే సందిగ్ధతకు గురయ్యారు. తేజా, అమర్, సందీప్, శోభా కన్నీరు పెట్టుకున్నారు. బిగ్ బాస్ తెలుగు 7 లేటెస్ట్ ప్రోమో ఈ విషయాలతో కూడుకొని ఉంది.
మరోవైపు అమర్ దీప్, శివాజీ, ప్రిన్స్ యావర్, శుభశ్రీ, గౌతమ్ కృష్ణ, తేజా, ప్రియాంక నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ కానున్నారు. అందరికంటే గౌతమ్, తేజాలకు తక్కువ ఓట్లు వచ్చాయని సమాచారం. ముఖ్యంగా తేజా ఎలిమినేట్ కానున్నాడనే ప్రచారం జరుగుతుంది.