సెన్సార్ బోర్డు‌పై విశాల్ ఆరోపణలు.. కేసు నమోదు చేసిన సీబీఐ..

By Sumanth Kanukula  |  First Published Oct 5, 2023, 1:48 PM IST

సెన్సార్ బోర్డుపై ప్రముఖ హీరో విశాల్ చేసిన ఆరోపణలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వేస్టిగేషన్(సీబీఐ) స్పందించింది. ఈ క్రమంలోనే ముంబై సెన్సార్ బోర్డు అధికారులతో పాటు పలువురిపై సీబీఐ కేసు నమోదు చేసింది.


సెన్సార్ బోర్డుపై ప్రముఖ హీరో విశాల్ చేసిన ఆరోపణలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వేస్టిగేషన్(సీబీఐ) స్పందించింది. ఈ క్రమంలోనే ముంబై సెన్సార్ బోర్డు అధికారులతో పాటు పలువురిపై సీబీఐ కేసు నమోదు చేసింది. తన సినిమా మార్క్ ఆంటోనీ హిందీ వెర్షన్‌కు సెన్సార్ సర్టిఫికేట్ పొందడానికి రూ. 6.5 లక్షలు లంచం ఇవ్వాల్సి వచ్చిందని విశాల్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) అధికారులతో సహా ముగ్గురు ప్రైవేట్ వ్యక్తులు మరియు పలువురు గుర్తు తెలియని వ్యక్తులపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఇక, విశాల్ నటించిన  మార్క్ ఆంటోనీ చిత్రం హిందీ వెర్షన్ సెప్టెంబర్ 28న విడుదలైంది.

click me!