Bigg Boss Telugu 7": బిగ్ బాస్ హౌస్లోకి సర్ప్రైజ్ ఎంట్రీలు... శివాజీ కొడుకుని చూశారా? హీరో మెటీరియల్!

By Sambi Reddy  |  First Published Nov 7, 2023, 2:13 PM IST

బిగ్ బాస్ షో ఫ్యామిలీ వీక్ లో అడుగుపెట్టింది. పది వారాలుగా ఇంటికి దూరమైన కంటెస్టెంట్స్ కోసం ఫ్యామిలీ మెంబర్స్ రానున్నారు. ఫస్ట్ ఛాన్స్ శివాజీకి దక్కింది. ఆయన్ని చూసేందుకు కొడుకు వచ్చాడు. 
 


బిగ్ బాస్ హౌస్లో జీవితం అంత సులభం కాదు. మానసికంగా, శారీరకంగా యుద్ధం చేయాలి. రోజుల తరబడి బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా ప్ బ్రతకడం అంత సులభం కాదు. ముఖ్యంగా కుటుంబ సభ్యులకు దూరం కావాల్సి వస్తుంది. ఈ హోమ్ సిక్ దూరం చేసి, కంటెస్టెంట్స్ లో ఎనర్జీ నింపేందుకు బిగ్ బాస్ 10వ వారం హౌస్ మేట్స్ కుటుంబ సభ్యులను కలిసే అవకాశం ఇస్తున్నారు. 

9వ వారం తేజ ఎలిమినేట్ కాగా హౌస్లో శివాజీ, ప్రశాంత్, అమర్, గౌతమ్, అర్జున్, యావర్, అశ్విని, రతిక, శోభ, ప్రియాంక ఉన్నారు. వీరిని కలిసేందుకు వరుసగా కుటుంబ సభ్యులు రానున్నారు. మొదటి ఛాన్స్ శివాజీకి దక్కింది. శివాజీ పెద్ద కుమారుడు హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. శివాజీని సర్ప్రైజ్ చేయాలని బిగ్ బాస్ స్పెషల్ సెటప్ చేశాడు. 

Latest Videos

శివాజీ చేతికి గాయమైన నేపథ్యంలో కన్సల్టేషన్ కోసం డాక్టర్ ని కలవమని చెప్పాడు. రూమ్ లో మాస్క్ తో ఉన్న వ్యక్తిని చూసి శివాజీ డాక్టర్ అనుకున్నాడు. శివాజీ కొడుకు అనుమానం రాకుండా... డాక్టర్ వలె నటించాడు. చేయి ఎలా ఉంది? వ్యయం చేస్తున్నారా? అని అడిగాడు. రెండు మూడు రోజుల్లో మీకు సెట్ అవుతుందని చెప్పగా... శివాజీ అలాగే అంటూ రూమ్ నుండి బయటకు వెళ్ళబోయాడు. అప్పుడు నాన్న అని పిలవడంతో అయోమయానికి గురయ్యాడు. మాస్క్ తీయడంతో గట్టిగా కౌగిలించుకుని శివాజీ ఏడ్చేశాడు. 

శివాజీని ఏడవకని కొడుకు ఓదార్చాడు. శివాజీ కొడుకు మంచి హైట్ తో హ్యాండ్సమ్ గా ఉన్నాడు. హీరో మెటీరియల్ అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. కొడుకుతో శివాజీ ఎమోషనల్ వీడియో వైరల్ అవుతుంది. 
 

click me!