బాలయ్య కోసం డైరెక్టర్ బాబీ భారీ ప్లాన్లు వేస్తున్నాడు. అందరికంటే తానే డిఫరెంట్ గా చూపించాలని ఆరాటపడుతున్నాడు.అందకు తగ్గట్టుగా షూటింగ్ కూడా ప్లాన్ చేసుకుంటున్నాట.
టాలీవుడ్ నట సింహం నందమూరి బాలకృష్ణ, మెగా దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కుతోంది ఓ సినిమా. వరుసగా మూడు సినిమాలు హిట్ కొట్టి.. హ్యాట్రిక్ హిట్ హీరో అనిపించుకున్న బాలకృష్ణ.. బాబీతో తాజాగా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సబంధించి ఏదో ఒక అప్ డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ వినిపిస్తోంది.
ఈ సినిమాలో బాలయ్య ఎంట్రీ సీన్స్ అద్భుతంగా ఉండేలాప్లాన్ చేశాడట డైరెక్టర్ బాబీ. అందు కోసం భారీగా సెట్లను కూడా ప్లాన్ చేశారట. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ సెట్ వేస్తున్నారట. ఈ సెట్ లో బాలయ్య – విలన్ల మధ్య యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ స్టార్ట్ చేస్తారట. ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలోనే మెయిన్ హైలైట్ గా నిలుస్తాయని తెలుస్తోంది. మరి ఈ సినిమాలో బాలయ్య ఫ్యాన్స్ కోసం బాబీ ఇంకా ఎలాంటి ఎలిమెంట్స్ రాశాడో చూడాలి.
మెగా హీరోలతో ఎక్కువగా సినిమాలు చేసే బాబీ.. ఈసారి బాలయ్య మూవీ చేస్తున్నాడు. బాలయ్య మార్క్ యాక్షన్ కు ఏమాత్రం సంబంధం లేకుండా. ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ తో సాగే ఎమోషనల్ డ్రామా అని ఇప్పటికే వార్తలు వచ్చాయి. కాగా ఈ సినిమాలో పాలిటిక్స్ నేపథ్యంలో కూడా ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందట. ఏది ఏమైనా ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో కూడా బాలయ్య డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ నాగవంశీ నిర్మిస్తున్నారు.