BB Telugu 7: హౌస్లో పల్లవి ప్రశాంత్ కి ప్రమాదం... తలకు దెబ్బతగిలి కుప్పకూలిపోయిన రైతుబిడ్డ!

Published : Sep 27, 2023, 11:24 AM IST
BB Telugu 7: హౌస్లో పల్లవి ప్రశాంత్ కి ప్రమాదం... తలకు దెబ్బతగిలి కుప్పకూలిపోయిన రైతుబిడ్డ!

సారాంశం

బిగ్ బాస్ హౌస్లో ప్రమాదం చోటు చేసుకుంది. కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్  తలకు గాయం కాగా అతడు కిందపడిపోయాడు. దీంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.   

బిగ్ బాస్ షోలో నాలుగో పవర్ అస్త్ర కోసం పోటీ మొదలైంది. ఆట సందీప్, శివాజీ, శోభా శెట్టి పౌర అస్త్ర గెలిచారు. వాళ్ళు ముగ్గురు కంటెండర్స్ అయ్యారు. నాలుగో పవర్ అస్త్ర కోసం బిగ్ బాస్ బ్యాంకు టాస్క్ నిర్వహిస్తున్నాడు. హౌస్ బ్యాంకుగా మారిందన్న బిగ్ బాస్... బ్యాంకర్స్ గా శివాజీ, సందీప్, శోభా వ్యవహరిస్తారని చెప్పాడు. కంటెస్టెంట్స్ బేబీ కాయిన్స్ సేకరించాల్సి ఉంది. టాస్క్ ముగిసే నాటికి ఎవరి దగ్గర ఎక్కువ కాయిన్స్ ఉంటాయో వారికి పవర్ అస్త్ర దక్కుతుందని చెప్పాడు. 

దీనిలో భాగంగా గార్డెన్ ఏరియాలో ఏటిఎం ఏర్పాటు చేశారు. బజర్ మోగిన వెంటనే పరుగెత్తుకెళ్లి ఏటీఎం కి ఉన్న బటన్ ని ప్రెస్ చేయాలి. ఈ టాస్క్ లో అందరూ బటన్ నొక్కే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. పల్లవి ప్రశాంత్ తలకు దెబ్బ తగలడంతో అతడు పక్కకు వచ్చేశాడు. వెంటనే కుప్పకూలిపోయాడు. కంటెస్టెంట్స్ అందరూ ఆందోళనగా పల్లవి ప్రశాంత్ చుట్టూ చేరారు. 

పల్లవి ప్రశాంత్ కి ఏ మేరకు గాయమైందనేది ఎపిసోడ్ చూస్తే కానీ తెలియదు. బిగ్ బాస్ తెలుగు 7 లేటెస్ట్ ప్రోమోలో ఈ సంఘటన చూపించారు. ఇక ఈ వారానికి ఆరుగురు నామినేషన్స్ లో ఉన్నారు. తేజా, గౌతమ్, శుభశ్రీ, ప్రియాంక, ప్రిన్స్ యావర్, రతికా రోజ్ ఈ లిస్ట్ లో ఉన్నారు. వీరిలో ఒకరు వచ్చే వారం ఇంటిని వీడనున్నారు. 14 మందితో షో మొదలైంది. కిరణ్ రాథోడ్, షకీలా, దామిని ఎలిమినేట్ అయ్యారు. 

వైల్డ్ కార్డు ఎంట్రీలు ఉంటాయని ప్రచారం జరుగుతున్నా ఎవరూ కొత్తవాళ్లు రావడం లేదు. నటుడు అంబటి అర్జున్, పూజా మూర్తి, హీరోయిన్ ఫర్జానాతో పాటు అరడజనుకు పైగా కంటెస్టెంట్స్ పేర్లు వినిపిస్తున్నాయి. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే
ఆ డైరెక్టర్ ఫోన్ చేసి ఐదుగురితో కమిట్‌మెంట్ అడిగాడు.. టాలీవుడ్ నటి ఓపెన్ స్టేట్‌మెంట్