
2017లో ఎన్టీఆర్ హోస్ట్ గా తెలుగు బిగ్ బాస్ షో మొదలైంది. అప్పటికి షో పట్ల ఆడియన్స్ కి అవగాహన లేకున్నప్పటికీ సక్సెస్ అయ్యింది. ఎన్టీఆర్ హోస్టింగ్ కి మార్కులు పడ్డాయి. సెకండ్ సీజన్ హోస్టింగ్ హీరో నాని చేశారు. సీజన్ 3 నుండి రంగంలోకి దిగిన నాగార్జున అప్రతిహతంగా కొనసాగుతున్నారు. ఆయన సారథ్యంలో షో సక్సెస్ ఫుల్ గా సాగుతుంది. అయితే సీజన్ 6 ఊహించని విధంగా ఫెయిల్ అయ్యింది. దారుణమైన టీఆర్పీ వచ్చింది.
షో రొటీన్ కావడమే ఇందుకు కారణమనే అభిప్రాయం ఉంది. దీంతో సీజన్ 7 పట్ల మేకర్స్ జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం. కంటెస్టెంట్స్ ఎంపిక నుండి గేమ్స్, టాస్క్స్ తో పాటు ఏకంగా షో ఫార్మట్ మార్చేశారని సమాచారం. 20 మంది కంటెస్టెంట్స్ పాల్గొనబోతుండగా ఈసారి రెండు వేర్వేరు హౌస్లు ఉంటాయట. ఒకే షోలో రెండు ఇళ్లు అన్నమాట.
కంటెస్టెంట్స్ ని విభజించి రెండు ఇళ్లలోకి పంపుతారట. కంటెస్టెంట్స్ గేమ్స్, టాస్క్స్, పరిస్థితులు, ప్రవర్తన ఆధారంగా ఇళ్ళు మారుతూ ఉంటారట. ఈ కాన్సెప్ట్ ఏదో బాగుందనిపిస్తుంది. ప్రేక్షకులకు కనెక్ట్ అయితే భారీ ఆదరణ దక్కడం ఖాయం. ఇక సెప్టెంబర్ 3 నుంచి బిగ్ బాస్ తెలుగు 7 ప్రసారం కానుంది. హీరోయిన్ ఫర్జానా, అబ్బాస్, షకీలా వంటి క్రేజీ పేర్లు వినిపిస్తున్నాయి.