Bigg Boss Telugu 7: మొదటి కెప్టెన్సీ టాస్క్... గందరగోళంగా బిగ్ బాస్ హౌస్!

Published : Oct 04, 2023, 11:48 AM IST
Bigg Boss Telugu 7: మొదటి కెప్టెన్సీ టాస్క్... గందరగోళంగా బిగ్ బాస్ హౌస్!

సారాంశం

బిగ్ బాస్ సీజన్ 7 మొదటి కెప్టెన్ ఎవరవుతారనే ఉత్కంఠ కొనసాగుతోంది. దీని కోసం బిగ్ బాస్ నిర్వహించిన టాస్క్ రసాభాసగా మారింది.    

మొన్నటి వరకు పవర్ అస్త్ర కోసం తన్నుకున్న కంటెస్టెంట్స్ ఇప్పుడు కెప్టెన్సీ కోసం పోటీపడుతున్నారు. హౌస్ లో ఉన్న 10 మంది కంటెస్టెంట్స్ ఐదు జట్లుగా బిగ్ బాస్ విభజించాడు. శివాజీ-ప్రశాంత్, ప్రియాంక-శోభా శెట్టి, గౌతమ్-శుభశ్రీ, ప్రిన్స్ యావర్-తేజ, అమర్ దీప్-సందీప్ లు జతకట్టారు. 'గెలిపించేది మీ నవ్వే' అనే టాస్క్ కండక్ట్ చేశాడు. జట్లుగా ఉన్న కంటెస్టెంట్స్ పెదాల బొమ్మకు పళ్ళు సక్రమంగా అమర్చి పూర్తి చేయాలి. 

ఈ టాస్క్ మొదట పల్లవి-ప్రశాంత్ పూర్తి చేశారు. తర్వాత మిగతా టీమ్స్ కూడా పూర్తి చేశాయి. అయితే ఎవరు సక్రమంగా అమర్చారు అనే విషయంలో గందరగోళం నెలకొంది. ఈ టాస్క్ కి ప్రిన్స్ యావర్-శోభా శెట్టి సంచాలకుగా ఉన్నారు. దీంతో వారి నిర్ణయాలపై కంటెస్టెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రిన్స్ యావర్ పక్షపాతంగా నిర్ణయం తీసుకున్నాడని శివాజీ అన్నాడు. అమర్ దీప్, ప్రియాంక కూడా సంచాలకుల నిర్ణయాలు తప్పుబట్టారు. 

నేను ఎలా బయాస్డ్ అవుతానని ప్రిన్స్ యావర్ వాదించాడు. విమర్శల నేపథ్యంలో శోభా శెట్టి కన్నీరు పెట్టుకుంది. ఇక 'గెలిపించేది మీ నవ్వే' టాస్క్ లో నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళేది ఎవరు? కెప్టెన్ అయ్యేది ఎవరు? అనే ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు ఈ వారం అమర్ దీప్, ప్రియాంక, ప్రిన్స్ యావర్, శివాజీ, గౌతమ్ కృష్ణ, శుభశ్రీ, తేజా నామినేట్ అయ్యారు. ఓటింగ్ లో తేజా, ప్రియాంక వెనకబడినట్లు సమాచారం. వీరిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి. 

అలాగే ఒకేసారి ఐదుగురు కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ద్వారా హౌస్లోకి వెళ్లనున్నారట. ఇది మినీ లాంచింగ్ ఈవెంట్ లాంటిదే అంటున్నారు. సీరియల్ నటుడు అంబటి అర్జున్, సీరియల్ నటి పూజా మూర్తి, భోలే షామిలి, అంజలి పవన్, నాయని పావని ఈ లిస్ట్ లో ఉన్నారు. ఈ కంటెస్టెంట్స్ హౌస్లో అడుగుపెడుతున్నారనేది సోషల్ మీడియా టాక్. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి