ఫ్యాన్స్ కు ‘సలార్’డబుల్ ట్రీట్ ?

Published : Oct 04, 2023, 08:50 AM IST
 ఫ్యాన్స్ కు ‘సలార్’డబుల్ ట్రీట్ ?

సారాంశం

 ‘హోంబలే ఫిల్మ్స్’ ప్రొడక్షన్ హౌజ్  KGF, కాంతర లాంటి క్వాలిటీ సినిమాలని ప్రొడ్యూస్ చేసింది. ప్రమోషన్స్ విషయంలో మొదటి నుంచి చాలా ప్లానింగ్ గా వెళ్తుంది ఈ ప్రొడక్షన్ హౌస్. 


పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్  తాజా చిత్రం సలార్  రిలీజ్ డేట్ కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. కేజీఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై భారీ ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. సెప్టెంబర్ 28వ తేదీన రిలీజ్ కావాల్సిన ‘సలార్: పార్ట్ 1 - సీజ్‍ఫైర్’ డిసెంబర్ 22 వ తేదీకి ఫోస్ట్ ఫోన్ అయ్యింది. ఈ విషయం ప్రకటించిన దగ్గర నుంచి ఈ చిత్రం ప్రమోషన్స్ పై ప్రభాస్ ఫ్యాన్స్ దృష్టి మరలింది.   సలార్‌ ట్రైలర్ కోసం వాళ్లు వెయ్యి కళ్లతో వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ విషయం గమనించిన చిత్ర టీమ్ ... అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యినట్లు సమాచారం. 
 
సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం నుంచి రెండు ట్రైలర్స్ విడుదల చేయటానికి టీమ్ రెడీ అయ్యింది. అందులో మొదటి ట్రైలర్ ని అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టిన రోజు సందర్బంగా వదలనున్నారు. అలాగే సెకండ్ ట్రైలర్ ని రిలీజ్ డేట్ కు దగ్గరలో వదలుతారు. ఈ రెండు ట్రైలర్స్ తో సినిమా క్రేజ్ పీక్స్ కు చేరుతుందని భావిస్తున్నారు. సలార్ ని నిర్మిస్తున్న ‘హోంబలే ఫిల్మ్స్’ ప్రొడక్షన్ హౌజ్  KGF, కాంతర లాంటి క్వాలిటీ సినిమాలని ప్రొడ్యూస్ చేసింది. ప్రమోషన్స్ విషయంలో మొదటి నుంచి చాలా ప్లానింగ్ గా వెళ్తుంది ఈ ప్రొడక్షన్ హౌస్. 

ఏదైమైనా ఈ చిత్రం కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారనటంలో సందేహం లేదు. ప్రభాస్ ఈ సినిమాపై బాగా నమ్మకాలు పెట్టుకున్నారు. ఈ ఏడాది ఆదిపురుష్ తో  ప్రభాస్ పెద్ద డిజాస్టర్  అందుకోవడంతో అభిమానులందరూ.. ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ బాగా ఆకట్టుకున్నాయి. ఇంకా  ఈ చిత్రం నిమిత్తం కొన్ని రీ షూట్ లు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అద్బుతమైన అవుట్ ఫుట్ తో కేజీఎఫ్ ని మించిన హిట్ ఇవ్వాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నట్లు సమాచారం. 

అలాగే  ఈ చిత్రంలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, కేజీయఫ్‌ ఫేమ్‌ యశ్‌ నటించారట. సినిమా క్లైమాక్స్‌లో హీరో యశ్‌తో పాటు ఎన్టీఆర్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నారట. ప్రశాంత్‌ తన తర్వాత సినిమా ఎన్టీఆర్‌తో చేస్తున్నాడు. దేవర షూటింగ్‌ పూర్తయిన వెంటనే ఎన్టీఆర్‌ బాలీవుడ్‌ మూవీ ‘వార్‌ 2’లో నటిస్తాడు. ఆ సినిమా తర్వాత ప్రశాంత్‌ నీల్‌ మూవీ చేస్తాడు. అలాగే యశ్‌తో కేజీయఫ్‌ 3 కూడా ప్లాన్‌ చేస్తున్నాడు ప్రశాంత్‌. ఈ నేపథ్యంలో వీరిద్దరు సలార్‌లో గెస్ట్‌ రోల్‌ చేసే అవకాశాలు  ఉన్నాయని సినీ వర్గాలు అంటున్నాయి. అయితే దీనిపై చిత్రయూనిట్‌ ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి