Bigg Boss Telugu 7 : పల్లవి ప్రశాంత్ - అమర్ మధ్య వార్.. ఒకరిపై మరొకరు మాటల తూటాలు..

Published : Dec 04, 2023, 08:53 PM IST
Bigg Boss Telugu 7 : పల్లవి ప్రశాంత్ - అమర్ మధ్య వార్.. ఒకరిపై మరొకరు మాటల తూటాలు..

సారాంశం

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. దీంతో హౌజ్ మేట్ల మధ్య వార్ రసవత్తరంగం సాగుతోంది. తాజాగా పల్లవి ప్రశాంత్ - అమర్ దీప్ ల మధ్య గట్టి మాటల యుద్ధం నడించింది.

బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్ (Bigg Boss Telugu 7) మొదటి నుంచి రసవత్తరంగా సాగుతోంది. ప్రస్తుతం షో చివరిదశకు చేరుకుంది. మరో రెండు వారాల్లో ముగియనుంది. ఈ సందర్భంగా చివరి నామినేషన్స్ చాలా ఆసక్తికరంగా జరుగుతున్నాయి. నిన్న (ఆదివారం) గౌతమ్ కృష్ణ (Gautam Krishna)  ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. నెక్ట్స్ ఎలిమినేషన్ పై నామినేషన్స్ ను కొనసాగుతున్నాయి. 

గౌతమ్ కృష్ణ వెళ్లిపోవడంతో హౌజ్ లో ప్రస్తుతం ఏడుగురు కంటెస్టెంట్లు మిగిలి ఉన్నారు. శివాజీ, అమర్ దీప్, అర్జున్, పల్లవి ప్రశాంత్, యావర్, ప్రియాంక, శోభా శెట్టి ఉన్నారు. ఇక 14వ వారం నామినేషన్స్ ద్వారా ఇద్దరు ఇంటికి వెళ్లాల్సి ఉంది. ఫైనల్స్ కు కేవలం ఐదుగురు మాత్రమే ఉంటుంది. కాబట్టి నెక్ట్స్ ఇద్దరిని ఇంటిని నుంచి పంపించాల్సి ఉటుంది. ఆ ఇద్దరు ఎవరనేది ఆసక్తికరంగా మారింది.

సోమవారం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఈ సందర్భంగా కంటెస్టెంట్ల మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఒకరిపై ఒకరు తప్పులను ఎత్తిచూపుతూ మాటల తూటాలు పేల్చారు. ఉదయం బిగ్ బాస్ మొదటి ప్రోమోలో శివాజీ - శోభా శెట్టి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇక తాజాగా వదిలిన రెండో ప్రోమోలో పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth) -  అమర్ దీప్ (Amardeep)  మధ్య ఘర్షణ జరిగింది. 

నామినేషన్స్ లో భాగంగా కంటెస్టెంట్లు నామినేట్ చేసే వారి ఫొటో స్టాంప్ ను టైల్ పై ముద్రించి.. రీజన్ చెప్పిన తర్వాత దాన్ని బ్రేక్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అమర్ దీప్ పల్లవి ప్రశాంత్ ను నామినేట్ చేశారు. ఈ సందర్భంగా రైతుబిడ్డను ‘రా’ కొట్టాడు. అందుకు ప్రశాంత్ నన్ను అరేయ్ అనొద్దంటూ చెప్పుకొచ్చారు. అయినా అమర్ దీప్ వినలేదు. అలాగే అర్జున్ కూడా అమర్ తీరును తప్పుబట్టారు. ఇక శివాజీ శోభా తప్పును ఎత్తిచూపారు. ప్రోమో ఆసక్తికరంగా ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: భరణి ఎలిమినేటెడ్.. టాప్ 5 సభ్యులు వీరే, ప్రియురాలి కోసం ఇమ్ము చేయబోతున్న త్యాగం ఇదే
రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు