Thalaivar 170 : షూటింగ్ లో హీరోయిన్ కు గాయలు.. రితికా సింగ్ రెండు చేతులకు రక్తం.. ఎలా జరిగిందంటే?

Published : Dec 04, 2023, 07:32 PM ISTUpdated : Dec 05, 2023, 04:29 PM IST
Thalaivar 170 : షూటింగ్ లో హీరోయిన్ కు గాయలు.. రితికా సింగ్ రెండు చేతులకు రక్తం.. ఎలా జరిగిందంటే?

సారాంశం

నటి, మార్షల్ ఆర్టిస్ట్ రితికా సింగ్ ఇంట్రెస్టింగ్ చిత్రాల్లో నటిస్తూ అలరిస్తోంది. ప్రస్తుతం కోలీవుడ్ లో రూపుదిద్దుకుంటున్న క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తోంది. తాజాగా షూటింగ్ లో గాయపడింది. ఇందుకు సంబంధించిన ఫొటో, వీడియోలను పంచుకుంది. ఇంతకీ ఎలా గాయమైందంటే...

మార్షల్ ఆర్టిస్ట్ రితికా సింగ్ (Ritika Singh)  2016 నుంచి ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటోంది. నటిగా చిత్ర పరిశ్రమలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. తెలుగులో ‘గురు’, ‘నీవెవ్వరో’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. విభిన్న పాత్రలు పోషిస్తూ వస్తున్న యంగ్ బ్యూటీ రీసెంట్ గానూ క్రేజీ ప్రాజెక్ట్స్ లో మెరిసింది. మలయాళంలో వచ్చిన ‘కింగ్ ఆఫ్ కోత’లో స్పెషల్ సాంగ్స్ తో అదరగొట్టింది. 

ప్రస్తుతం కోలీవుడ్ లో రూపుదిద్దుకుంటున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘తలైవా 170’ (Thalaivar 170) లో కీలక పాత్రలో నటిస్తోంది. యాక్షన్ తో అదరగొట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చెన్నైలో తాజాగా షూటింగ్ లో పాల్గొన్న రితికా సింగ్ గాయపడింది. అందుకు సంబంధించిన ఫొటో, వీడియోలను అభిమానులతో పంచుకుంది. రక్తపు మరకలతో ఉన్న చేతిని చూపించింది. ఎలా గాయపడిందో కూడా వివరించింది. 

‘తలైవా170’ షూటింగ్ లో పాల్గొన్న రితికా సింగ్ తోడేలు (WereWolf) తో ఫైట్ చేయాల్సి ఉంది. సెట్స్ లో షూట్ జరుగుతుండగా నియంత్రణ కోల్పోయాను. ఈక్రమంలో చేతికి గాజు పెంకులు గుచ్చుకున్నాయి. అలా గాయమైంది. మళ్లీ ఈరోజు షూటింగ్ లో పాల్గొంటున్నాను. అప్పుడప్పుడు ఇలా జరుగుతూనే ఉంటుంది.’ అంటూ ఓ వీడియోలో చెప్పుకొచ్చింది. పెద్దగా ప్రమాదమేమీ లేకపోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.  

 ఇక ‘తలైవా 170’ చిత్ర విషయానికొస్తే.. సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు. కేరళలోని తిరువనంతపురంలో గ్రాండ్ గా పూజా కార్యక్రమాలతో షూట్ ప్రారంభమైంది.  చిత్రంలో స్టార్ కాస్ట్ అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి (Rana Daggubati), మంజు వారియర్, దుషార విజయన్ (Dushara Vijayan) , ఫహద్ ఫాజిల్ తదితరులు నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తుండటం విశేషం. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు.  

 

PREV
click me!

Recommended Stories

మణిరత్నం సంచలనం.. 34 ఏళ్ల బంధానికి బ్రేక్.. రెహమాన్‌ను కాదని కుర్రాడికి ఛాన్స్
Ustaad Bhagat Singh Movie Review: ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ మూవీ రివ్యూ, పవన్‌ కళ్యాణ్‌ విశ్వరూపం చూపించాడా?