ఏ వెధవ పంపించాలని చూసినా కప్పు కొట్టుకునే పోతా.. శివాజీని ఉద్దేశిస్తూ అమర్ వార్నింగ్!

నామినేషన్స్ లో అమర్ దీప్ రచ్చ రచ్చ చేశాడు. భోలే, శివాజీ, ప్రశాంత్ పై ఫైర్ అయ్యాడు. కప్పు కొట్టుకునే పోతా అంటూ పెద్ద పెద్ద డైలాగ్స్ కొట్టాడు.  


నామినేషన్స్ డే వచ్చిందంటే బిగ్ బాస్ హౌస్ సీరియస్ గా మారిపోతుంది. వారం రోజులుగా మనస్సులో దాచుకున్న అసహనం మొత్తం బయటపెట్టేస్తారు హౌస్ మేట్స్. సోమవారం ఎపిసోడ్లో నామినేషన్ ప్రక్రియ కొంత వరకు జరిగింది. శివాజీ... శోభా, ప్రియాంకలను నామినేట్ చేశాడు. అశ్విని కూడా ఈ సీరియల్ బ్యాచ్ నే నామినేట్ చేసింది. గౌతమ్... భోలే, శివాజీలను చేశాడు. ప్రియాంక... భోలే, అశ్వినిలను నామినేట్ చేసింది. 

సందీప్... ప్రశాంత్, భోలే, శోభా శెట్టి... యావర్, శివాజీ, భోలే... శోభా శెట్టి, గౌతమ్ లను చేశాడు. నేటి ఎపిసోడ్లో నామినేషన్స్ ప్రాసెస్ వాడివేడిగా సాగినట్లు ప్రోమో చూస్తే అర్థం అవుతుంది. యావర్... సందీప్ ని నామినేట్ చేశాడు. నువ్వు సేఫ్ ప్లేయర్ అని అన్నాడు. ఈ ఇంట్లో నీకంటే సేఫ్ ప్లేయర్ ఎవరూ లేరని సందీప్ ఎదురు చెప్పాడు. నేను మొదటి వారం నుండి నామినేషన్స్ లో ఉన్నా... నువ్వు లేవు. అందుకే సేఫ్ ప్లేయర్ ని యావర్ అన్నాడు. 

Latest Videos

యావర్ అలాగే శోభా శెట్టిని నామినేట్ చేశాడు. అమర్... శివాజీ, భోలేలను నామినేట్ చేశాడు. భోలే, అమర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అలాగే సందీప్ తో శివాజీ, భోలేకి కూడా వాదన చోటు చేసుకుంది. నువ్వు గట్టిగా మాట్లాడితే తప్పు ఒప్పు అయిపోదు అని సందీప్ కి శివాజీ కౌంటర్ వేశాడు.  అనంతరం పల్లవి ప్రశాంత్... గౌతమ్, అమర్ దీప్ లను నామినేట్ చేశాడు. సిల్లీ పాయింట్స్ తో నామినేట్ చేశావని ప్రశాంత్ కారణంగా చెప్పగా, రివేంజ్ నామినేషన్ అంటూ గౌతమ్ కౌంటర్ వేశాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం నడిచింది. 

అమర్ దీప్ ని కూడా ప్రశాంత్ నామినేట్ చేశాడు. ప్రశాంత్-అమర్ గొడవలో కలగజేసుకున్న భోలేని ఉద్దేశిస్తూ... మధ్య లో మాట్లాడితే పగిలిపోయిద్ది అని కుర్చీ తన్నాడు. రేయ్ నీ వెనుక రెండు పెద్ద చేతులు ఉన్నాయని రెచ్చిపోతున్నావ్ అని శివాజీని ఉద్దేశించి అన్నాడు. ఎవరు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారో ప్రేక్షకులు చుస్తున్నారని శివాజీ అమర్ కి కౌంటర్ వేశాడు. ఈ వెధవ నన్ను ఇక్కడ నుండి పంపేయాలన్నా నేను ఇక్కడే ఉంటా, కప్పు కొట్టుకొని పోతా. అమర్ ఈజ్ బ్యాక్ అంటూ పెద్ద పెద్ద సవాళ్లు విసిరాడు... ఈ నామినేషన్స్ వైల్డ్ గా సాగాయి. 

click me!