ప్రియాంక, శోభా వలన నేను మునిగిపోయేలా ఉన్నాను... అమర్ అలా అనేశాడేంటి, ఇప్పటికి అర్థమైందా!

Published : Oct 29, 2023, 01:27 PM ISTUpdated : Oct 29, 2023, 01:29 PM IST
ప్రియాంక, శోభా వలన నేను మునిగిపోయేలా ఉన్నాను... అమర్ అలా అనేశాడేంటి, ఇప్పటికి అర్థమైందా!

సారాంశం

టైటిల్ ఫెవరేట్ హోదాలో అడుగుపెట్టిన అమర్ దీప్ అంచనాలను అందుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. అతని గేమ్ లో క్లారిటీ మిస్ అయ్యింది. కాగా ప్రియాంక, శోభాల వలన నేను మునిగిపోయేలా ఉన్నానని అమర్ చెప్పడం ఆసక్తి రేపుతోంది.   

ప్రియాంక, శోభా శెట్టి, అమర్ దీప్ సీరియల్ బ్యాచ్ గా పేరు తెచ్చుకున్నారు. ఈ ముగ్గురు కలిసి గేమ్ ఆడుతున్నారనేది నిజం. వీళ్ళు ఒకరినొకరు నామినేట్ చేసుకోరు. టాస్క్ లో ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. అయితే అది ఒప్పుకోరు. మాకు గ్రూప్ ఇజం లేదు. ఇండివిడ్యువల్ గా ఆడుతున్నాం అంటారు. ఆదివారం ఎపిసోడ్లో ఇంటి సభ్యులకు ఓ క్రేజ్ టాస్క్ ఇచ్చాడు నాగార్జున. ప్రతి ఇంటి సభ్యుడికి అత్యంత ఇష్టమైన ఇద్దరు హౌస్ మేట్స్ లో ఎవరిని సేవ్ చేస్తావు, ఎవరిని ముంచేస్తావు అని అడిగాడు. 

గౌతమ్ కి నాగార్జున అర్జున్, ప్రియాంక పేర్లు చెప్పాడు. ఈ ఇద్దరిలో ఎవరిని సేవ్ చేస్తావు? ఎవరిని ముంచేస్తావు? అని అడిగారు. గౌతమ్, ప్రియాంకను సేవ్ చేస్తాను, అర్జున్ ని సింక్ చేస్తాను అన్నాడు. అర్జున్ కి గౌతమ్, అమర్ పేర్లు చెప్పాడు. అమర్ ని ముంచేసిన అర్జున్... గౌతమ్ ని సేవ్ చేశాడు. అమర్ కి రెండు పేర్లు చెప్పాడు. శోభా, ప్రియాంకలలో ఎవరిని సేవ్ చేస్తావు? ఎవరిని ముంచేస్తావని అడిగారు నాగార్జున. 

వాళ్ళ ఇద్దరి వలన నేను మునిగిపోయేలా ఉన్నానని అమర్ అన్నాడు. అది ఫ్లోలోనో, జోక్ కోసమో అన్నా కానీ అదే నిజం. తప్పైనా ఒప్పైనా అటాకింగ్ గేమ్ ఆడుతూ వాళ్ళు ముందుకు వెళుతున్నాడు. అమర్ తన గేమ్ తాను ఆడకుండా వాళ్ళను కాపాడుతూ వెనుకబడిపోతున్నాడు. ఈ సీజన్ కి అమర్ పెద్ద వెర్రి పప్ప లా అవతరించాడు. ఈ ఇద్దరిలో ఎవరిని సేవ్ చేశాడనేది ఆసక్తికరం. 

ఇక యావర్ ని శివాజీ, రతికలలో ఎవరిని సేవ్ చేశావని అడగ్గా... శివాజీ పేరు చెప్పాడు. శివాజీ మాత్రం యావర్ ని ముంచేసి పల్లవి ప్రశాంత్ ని సేవ్ చేశాడు. ఇక తేజా.. శోభాను ముంచి యావర్ ని సేవ్ చేశాడు. భోలే... పల్లవి ప్రశాంత్ ని సేవ్ చేసి.. అశ్వినిని ముంచేశాడు. ఈ గేమ్ ఆసక్తికరంగా సాగింది. 
 

PREV
click me!

Recommended Stories

ప్రభాస్‌కి గ్యాప్‌ లేకుండా చేసిన చిరంజీవి.. `మన శంకరవరప్రసాద్‌ గారు` రిలీజ్‌ డేట్‌ ఫిక్స్
Suman Shetty Eliminate: సుమన్‌ శెట్టి ఎలిమినేట్‌.. భరణితో స్నేహం దెబ్బ కొట్టిందా? తనూజ ఆవేదన