అదితి, సిద్దార్థ్ కి పిల్లలు పుడితే నీ పేరు పెట్టాలా ఏంటి ?.. అజయ్ భూపతి ట్వీట్ పై ఫన్నీ ట్రోల్స్

అందాల భామ అదితి రావు హైదరి గురించి పరిచయం అవసరం లేదు. నటిగా టాలీవుడ్ లో ఆమె ఫుల్ మార్క్స్ కొట్టేసింది. అవకాశం వచ్చినప్పుడల్లా తనని తానూ నిరూపించుకుంటోంది.

Ajay Bhupathi funny tweet on siddharth and aditi gets trolled dtr

అందాల భామ అదితి రావు హైదరి గురించి పరిచయం అవసరం లేదు. నటిగా టాలీవుడ్ లో ఆమె ఫుల్ మార్క్స్ కొట్టేసింది. అవకాశం వచ్చినప్పుడల్లా తనని తానూ నిరూపించుకుంటోంది. ఆమె కెరీర్ లో పెద్దగా విజయాలు లేకపోవడమే మైనస్ గా మారింది. కానీ అదితి రావుకి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. అదితి చివరగా మహాసముద్రం అనే క్రేజీ మూవీలో నటించింది. అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఆ మూవీ నిరాశపరిచింది. 

ఆల్రెడీ అదితి రావు పెళ్లి చేసుకుని భర్త నుంచి విడిపోయింది. భర్త నుంచి విడిపోయాక అదితి సింగిల్ గా ఉంటోంది. అయితే మహాసముద్రం చిత్రం తర్వాత మరోసారి ఆమెలో ప్రేమ చిగురించింది. అది ఎవరితోనో కాదు.. మహాసముద్రంలో తనకు కోస్టార్ గా నటించిన క్రేజీ హీరో సిద్దార్థ్ తో.. వీళ్ళిద్దరూ తరచుగా చెట్టాపట్టాలేసుకుని పబ్లిక్ గా తిరిగేస్తున్నారు. 

Latest Videos

ప్రస్తుతం అదితి, సిద్దార్థ్ సహజీవనం చేస్తున్నారు. వీరిద్దరి ప్రేమ మహాసముద్రం చిత్రం నుంచే మొదలైనట్లు రూమర్స్ ఉన్నాయ్. అయితే సిద్దార్థ్, అదితి సన్నిహితంగా ఉంటున్న ఓ పిక్ ని షేర్ చేస్తూ మహాసముద్రం డైరెక్టర్ అజయ్ భూపతి ఫన్నీ ట్వీట్ చేశారు. 

సిద్దార్థ్, అదితి సన్నిహితంగా ఉన్న పిక్ ని ఉద్దేశిస్తూ దీనంతటికి కారణం నేనే అని అంతా అనుకుంటున్నారు. అసలు ఏం జరుగుతోంది ? అంటూ అజయ్ భూపతి ఫన్నీగా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అజయ్ భూపతి ట్వీట్ పై నెటిజన్లు ఫన్నీగా ట్రోల్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే.. ఇప్పుడేంటి.. వాళ్ళిద్దరికీ పిల్లలు పుడితే నీ పేరు పెట్టాలా ఏంటి ? అని ప్రశ్నిస్తున్నారు. 

Everyone thinks I'm the reason for this... What's actually happening?? 🤔 pic.twitter.com/vcXQcMrmvu

— Ajay Bhupathi (@DirAjayBhupathi)

మరికొందరు' మొత్తం  మీరే చేశారు'.. అంటూ సిద్దార్థ్ బొమ్మరిల్లు డైలాగ్ పోస్ట్ చేస్తున్నారు.  మరికొందరు మీరే  దగ్గరుండి పెళ్లి కూడా చేసేయండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.  ఇదిలా ఉండగా ప్రస్తుతం అజయ్ భూపతి.. పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో మంగళవారం అనే చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ట్రైలర్ కి మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ వచ్చింది. నవంబర్ 17న ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. 

vuukle one pixel image
click me!