పాపం ఆయన మాత్రం ఏం చేస్తారు... తిడుతుంటే!

By Sambi ReddyFirst Published Sep 18, 2022, 3:41 PM IST
Highlights

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున నిన్న కంటెస్టెంట్స్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. తొమ్మిది మంది కంటెస్టెంట్స్ అసలు గేమ్ ఆడడం లేదన్న నాగార్జున ఒకరిని ఎలిమినేట్ చేసి బయటికి పంపేశారు.

ప్రతి శని, ఆదివారాలు హోస్ట్ నాగార్జున వస్తారు. ఇంటి సభ్యుల ప్రవర్తనపై ఓ రివ్యూ నిర్వహిస్తాడు. బాగా ఆడినవారిని పొగడడం, ఆడని వారిని మందలించడం చేస్తారు. సాధారణంగా ఆయన కోపం పరిమితంగా, హద్దుల్లోనే ఉంటుంది. దీనికి భిన్నంగా సెప్టెంబర్ 17 ఎపిసోడ్ లో నాగార్జున ఆగ్రహం కట్టలు తెంచుకుంది.  జీరో పెర్ఫార్మన్స్ అని నిలబెట్టిన తొమ్మిది మంది కంటెస్టెంట్స్ తో పాటు మిగతా వారిని కూడా కడిగిపారేశారు. టార్గెట్ చేసిన తొమ్మిది మందిపై మరింతగా విరుచుకుపడ్డాడు. 

సరిగా ఆడటం లేదని ఎలిమినేట్ చేయడం నిజంగా షాకింగ్ పరిణామం. ఆ తొమ్మిది మంది కంటెస్టెంట్స్ లో ఒకరిగా ఉన్న షానిని నాగార్జున ఎలిమినేట్ చేశారు. ఇక షానికి ఆయన చెప్పిన వీడ్కోలు కూడా సాదా సీదాగా అమర్యాదకరంగా ఉంది. ఒక్క వారంలో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ కి కూడా బిగ్ బాస్ షో మంచి వీడ్కోలు ప్లాన్ చేస్తుంది. హౌస్ లో కంటెస్టెంట్ జర్నీని ఏవీ రూపంలో ప్రదర్శిస్తారు. షాని విషయంలో అలాంటివేవీ జరగలేదు. పైగా షానిని నాగార్జున మనస్ఫూర్తిగా కూడా మాట్లాడనివ్వలేదు. ఎనీవే... అంటూ గుడ్ బై చెప్పేశాడు. 

ఇక నాగార్జున కంటెస్టెంట్స్ ని రెచ్చగొట్టిన తీరు మరింత దారుణంగా ఉంది. కారణం ఉన్నా లేకుండా కొట్టుకు చావండి, అన్నరీతిలో కంటెస్టెంట్స్ మధ్య చిచ్చు పెట్టాడు. హౌస్ లో ప్రశాంతంగా గేమ్ ఆడేవారికి చోటు లేదని చెప్పకనే చెప్పాడు. నాగార్జున ఇలా ప్రవర్తించడానికి కారణం బిగ్ బాస్ నిర్వాహకుల ఒత్తిడే అని తెలుస్తుంది. అనుకున్న స్థాయిలో షోకి టీఆర్పీ రావడం లేదు, ఈ క్రమంలో కంటెస్టెంట్స్ ని రెచ్చగొట్టడం ద్వారా స్పైసీ కంటెంట్ రాబట్టవచ్చని మేకర్స్ ప్లాన్. 

ఈ విషయంలో బిగ్ బాస్ మేకర్స్ నాగార్జునకు క్లాస్ ఇచ్చారు. ఆ వేడిని ఆయన కంటెస్టెంట్స్ పై చూపించారు. మరోవైపు బిగ్ బాస్ సీజన్ 6 లాంచింగ్ ఎపిసోడ్ దారుణమైన రేటింగ్ తో షాక్ ఇచ్చింది. కేవలం 8.8 టీఆర్పీ అందుకుంది. ఇది గత సీజన్స్ తో పోల్చితే సగం కూడా లేదు. ఈ నేపథ్యంలో మేకర్స్ షో పట్ల చాలా అసహనంగా ఉన్నారు. టీఆర్పీ పెంచాలని హోస్ట్ నాగార్జునపై మేకర్స్ ఒత్తిడి తీసుకురావడంతో.. ఆయన కంటెస్టెంట్స్ ని ఏసుకున్నారని అంటున్నారు కొందరు. 
 

click me!