Bigg Boss Telugu 6: నా వల్ల కాదు బిగ్ బాస్... ఫైనల్ కి ముందు చేతులెత్తేసిన శ్రీసత్య!

Published : Dec 09, 2022, 03:22 PM ISTUpdated : Dec 09, 2022, 11:36 PM IST
Bigg Boss Telugu 6: నా వల్ల కాదు బిగ్ బాస్... ఫైనల్ కి ముందు చేతులెత్తేసిన శ్రీసత్య!

సారాంశం

కంటెస్టెంట్స్ ని భయపెట్టే ప్రోగ్రాం పెట్టుకున్నాడు బిగ్ బాస్. కన్ఫెషన్ రూమ్ ని హారర్ మూవీ సెట్ గా మలచి ఒక్కొక్కరికీ చుక్కలు చూపిస్తున్నాడు. తాజాగా శ్రీసత్య వంతు వచ్చింది.   


బిగ్ బాస్ సీజన్ 6 కొద్ది రోజుల్లో ముగియనుంది. విన్నర్ ప్రైజ్ మనీతో పాటు టైటిల్ కైవసం చేసుకోనున్నాడు. హౌస్లో రేవంత్, ఆదిరెడ్డి, శ్రీహాన్, కీర్తి, రోహిత్, ఇనయా, శ్రీసత్య ఉన్నారు. వీరిలో ఒకరు విన్నర్ కానున్నారు. అలాగే ఇద్దరు ఫైనల్ కి వెళ్లకుండానే ఎలిమినేట్ కానున్నారు. కాగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ధైర్యానికి పరీక్ష పెడుతున్నాడు. కన్ఫెషన్ రూమ్ కి ఒక్కొక్కరినీ పిలిచి చుక్కలు చూపిస్తున్నాడు. 

కన్ఫెషన్ రూమ్ ని బిగ్ బాస్ డార్క్ రూమ్ గా మలచి హారర్ మూవీ సెటప్ చేశాడు. పాములు, గడ్డి, అస్థిపంజరాలతో భయంకరంగా తయారు చేశాడు. అలాగే దెయ్యం గెటప్ లో ఒకరిద్దినీ ఆ చీకటి గదిలో ఉంచారు. హారర్ మూవీ సౌండ్ ఎఫెక్ట్స్ తో కంటెస్టెంట్స్ ని తీవ్రంగా భయానికి గురి చేస్తున్నాడు. మొదట ఆదిరెడ్డి వెళ్ళాడు. ఆదిరెడ్డి ఎవరైనా తోడు కావాలని కోరడంతో శ్రీహాన్ ని పంపాడు. ఆదిరెడ్డి, శ్రీహాన్ చాలా భయపడ్డారు. 

తర్వాత ఇనయా, రేవంత్ వెళ్లడం జరిగింది. వీరిద్దరూ కొంచెం ధైర్యం ప్రదర్శించారు. ఒక్కరే డార్క్ రూమ్ లో బిగ్ బాస్ చెప్పిన వస్తువు వెతికి బయటకు వచ్చారు. శ్రీసత్య మొదటిసారి బిగ్ బాస్ ఎంత చెప్పినా వెళ్ళలేదు. దాంతో బిగ్ బాస్ లక్ష రూపాయలు కట్ చేశాడు. ఆమెకు రెండో అవకాశం ఇచ్చాడు. అప్పుడు కూడా శ్రీసత్య నా వల్ల కాదు బిగ్ బాస్, ఎవరో ఒకరు తోడు ఉంటేనే కన్ఫెషన్ రూమ్కి వెళతానని ఖరాఖండిగా చెప్పింది. చేసేది లేక కీర్తిని శ్రీసత్యకు తోడుగా పంపారు. ఫైనల్ గా కన్ఫెషన్ రూమ్ కి హౌస్ మేట్స్ అందరినీ పిలవడం జరిగింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Kurchi Thatha: తీవ్ర విషాదం, సోషల్ మీడియా సంచలనం కుర్చీ తాత మృతి.. కన్నీరు మున్నీరవుతున్న వైజాగ్ సత్య
Madhuri Dixit: గర్భవతి, పైగా జ్వరం.. అయినా 13 గంటలు డ్యాన్స్ చేసిన హీరోయిన్