Bigg Boss Telugu 6: అది చేయాల్సింది మీరు సార్... ఆదిరెడ్డి మామూలోడు కాదు అడివి శేష్ కే ఝలక్ ఇచ్చాడు!

By Sambi ReddyFirst Published Dec 4, 2022, 1:51 PM IST
Highlights

కంటెస్టెంట్ ఆది రెడ్డి బిగ్ బాస్ వేదికపైకి  గెస్ట్ గా వచ్చిన అడివి శేష్ కి ఝలక్ ఇచ్చాడు. అది కనిపెట్టాల్సింది మీరంటూ కుండబద్దలు కొట్టాడు. ఆదిరెడ్డి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్స్ లో ఆదిరెడ్డి స్ట్రాంగ్ ప్లేయర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఆదిరెడ్డి గేమ్ కూడా జెన్యూన్ గా ఉంటుంది. అలాగే స్ట్రెయిట్ ఫార్వర్డ్ నేచర్ కలవాడు. తప్పు అనిపిస్తే బిగ్ బాస్ అయినా, హోస్ట్ అయినా ప్రశ్నిస్తాడు. తనది తప్పులేదనుకున్న సందర్భాల్లో నాగార్జునతో కూడా ఆదిరెడ్డి వాదించడం మనం చూశాము. ఈసారి ఆదిరెడ్డి షోకి గెస్ట్ గా వచ్చిన అడివి శేష్ కి ఝలక్ ఇచ్చాడు. 

అడివి శేష్ లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ హిట్ 2 మంచి  సాధించింది. పాజిటివ్ తెచ్చుకున్న హిట్ 2 చిత్రం చెప్పుకోదగ్గ ఓపెనింగ్స్ రాబట్టింది. ఈ చిత్ర ప్రమోషన్స్ కోసం అడివి శేష్ బిగ్ బాస్ వేదిక పైకి వచ్చాడు. హోస్ట్ నాగార్జున అడివి శేష్ ని సాదరంగా ఆహ్వానించారు. అయితే అడివి శేష్ రావడానికి ముందు  ఇంటి సభ్యులకు నాగార్జున ఒక పని చెప్పారు. అక్కడున్న అద్దం పై కోడి బుర్ర అని రాసి, పైన కపాలం బొమ్మ వేయాలి అన్నారు. 

with in the Bigg Boss House. Get ready for an evening full of fun 🥳

Catch all the fun tonight at 9 PM on & . pic.twitter.com/3ghQfmeKhT

— starmaa (@StarMaa)

అది హిట్ 2 మూవీలోని ఒక ఐకానిక్ సీన్ కి సంబంధించింది. అడివి శేష్ ని ఇబ్బంది పెడుతున్న సీరియల్ కిల్లర్ అద్దం మీద అలా బొమ్మేసి, కోడిబుర్ర అని రాస్తాడు. కాగా వేదికపైకి వచ్చిన అడివి శేష్ కి నాగార్జున ఒక టాస్క్ పెట్టాడు. అద్దంపై పుర్రె బొమ్మేసి కోడిబుర్ర అని రాసిన కంటెస్టెంట్ ఎవరో కనిపెట్టాలి అన్నాడు. అడివి శేష్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడు. కనిపెట్టడానికి ఒక లాజిక్ వాడాడు. 

అందరూ నిలబడితే హైట్ ని బట్టి చెప్తా అన్నారు. హైట్ ని బట్టి ఎలా చెబుతావని నాగార్జున అడగ్గా... బొమ్మ హైట్ లో లేదు. కాబట్టి కొంచెం పొట్టివాళ్లు గీసి ఉండొచ్చు అన్నాడు. హైట్ ఉన్నవాళ్లు బెండ్ అయ్యి కూడా వేయొచ్చు కదా అని రోహిత్  లాజిక్ తీశాడు. దానికి అడివి శేష్ 'ఆదిరెడ్డి నువ్వు వేశావు?'' అని అడిగాడు. అది మీరు చెప్పాలి సార్, అని ఆదిరెడ్డి గట్టిగా సమాధానం చెప్పడంతో అడివి శేష్ షాక్ అయ్యారు. అవును ఆదిరెడ్డి ని నాగార్జున సమర్ధించాడు. 

click me!