Bigg Boss Telugu 6: బిగ్ బాస్ హౌస్లో ఆది రెడ్డి వైఫ్... నువ్వేమైనా తోపా అంటూ భర్త గాలి తీసేసిన కవిత!

Published : Nov 22, 2022, 03:02 PM ISTUpdated : Nov 22, 2022, 03:12 PM IST
Bigg Boss Telugu 6: బిగ్ బాస్ హౌస్లో ఆది రెడ్డి వైఫ్... నువ్వేమైనా తోపా అంటూ భర్త గాలి తీసేసిన కవిత!

సారాంశం

బిగ్ బాస్ హౌస్లో ఫ్యామిలీ వీక్ స్టార్ట్ అయ్యింది. కంటెస్టెంట్స్ ని కలుసుకునేందుకు కుటుంబ సభ్యులను ఇంట్లోకి ప్రవేశపెడుతున్నారు. మొదటిగా ఆదిరెడ్డిని కలిసేందుకు వైఫ్ కవిత కూతురితో పాటు వచ్చింది.   

కంటెస్టెంట్స్ హౌస్లోకి వచ్చి దాదాపు మూడు నెలలు కావస్తోంది. 11 వారాలుగా కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు దూరంగా ఉంటున్నారు. కంటెస్టెంట్స్ హోమ్ సిక్ తో బాధపడుతున్నారు. దీంతో హౌస్లోకి ఫ్యామిలీ మెంబర్స్ ని ప్రవేశపెడుతున్నారు. మొదటగా ఆదిరెడ్డి వైఫ్ కవిత, కూతురితో పాటు ఎంట్రీ ఇచ్చింది. ప్రియమైన భార్య, ముద్దుల కూతురు రాకతో ఆది రెడ్డి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. కూతురితో ఆడుకుంటూ, కవితతో ముచ్చట్లు చెప్పుకున్నాడు. 

తన ఆట తీరు ఎలా ఉందని కవితను పదే పదే అడిగాడు. చాలా బాగా ఆడుతున్నావని కవిత చెప్పింది. నా డాన్స్ వరస్ట్ గా ఉంది కదా? అని ఆదిరెడ్డి కవితను అడిగాడు. లేదు నవ్వుకోవచ్చని ఆమె చెప్పారు. నువ్వు కూడా నవ్వుకుంటున్నావా నా డాన్స్ చూసి, అని ఆదిరెడ్డి ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఇక అందరూ మంచివాళ్ళే, గేమ్ లో కొట్టుకున్నా తిట్టుకున్నా కలిసి మెలిసి ఉండండి, అని కవిత ఇంటి సభ్యులను ఉద్దేశించి అన్నారు. నన్ను కూడా కొట్టమంటావా? అని ఆదిరెడ్డి అడిగాడు. నిన్ను కూడా... నువ్వేమన్నా తోపా అని కవిత పంచ్ వేసింది. ఆమె కామెంట్ కి ఇంటి సభ్యులు పెద్దగా నవ్వేశారు.  హౌస్లో ఉన్న కారణంగా ఆదిరెడ్డి కూతురు ఫస్ట్ బర్త్ డే మిస్ అయ్యాడు. దీంతో బిగ్ బాస్ హౌస్లో కేక్ అరేంజ్ చేశాడు. ఇంటి సభ్యుల మధ్య ఆదిరెడ్డి తన కూతురు బర్త్ డే వేడుకలు చేశాడు. 

బిగ్ బాస్ కి ఆదిరెడ్డి కృతజ్ఞతలు చెప్పాడు. ఆదిరెడ్డి కూతురితో ఆదుకోవడం చూసి రేవంత్ ఎమోషనల్ అయ్యాడు. గర్భవతిగా ఉన్న తన భార్యను రేవంత్ గుర్తు చేసుకున్నాడు. కన్నీటి పర్యంతమయ్యాడు. ఇక ఈ వారం 7మంది ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు. రేవంత్, కీర్తి మినహాయించి... మిగిలిన ఇంటి సభ్యులు నామినేషన్స్ లో ఉన్నారు. ఈ వారం మెరీనా ఎలిమినేటైన విషయం తెలిసిందే. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Shilpa Shetty ఇంట్లో ఐటీ దాడులు? 60 కోట్ల మోసం విషయంలో అసలు నిజం ఏంటో తెలుసా?
మూడో వారంలో ఎలిమినేట్ కావలసిన వాడు తనూజని వాడుకుని విన్నర్ రేసులోకి వచ్చేశాడు.. భరణి సంచలన వ్యాఖ్యలు