Bigg Boss Telugu 6: టాప్ లో ఆదిరెడ్డి సెకండ్ శ్రీహాన్... మూడో స్థానానికి పడిపోయిన రేవంత్!

By Sambi ReddyFirst Published Dec 2, 2022, 3:30 PM IST
Highlights


బిగ్ బాస్ హౌస్లో కీలకమైన టికెట్ టు ఫినాలే టాస్క్ నడుస్తుంది. గెలిచిన కంటెస్టెంట్స్ నేరుగా ఫైనల్ కి చేరే అవకాశం ఉంది. టికెట్ టు ఫినాలే టాస్క్ లో రేవంత్ మూడో స్థానానికి పడిపోగా... ఆదిరెడ్డి అనూహ్యంగా టాప్ పొజిషన్ లో కొనసాగుతున్నారు. 
 

టికెట్ టు ఫినాలే గెలుచుకోవడం ప్రతి కంటెస్టెంట్స్ కి చాలా అవసరం. దాన్ని దక్కించుకోవాలంటే కంటెస్టెంట్స్ బాగా కష్టపడాలి. బిగ్ బాస్ దశలవారీగా నిర్వహించే ఆటల్లో గెలిచి ముందుకు వెళ్ళాలి. ఫస్ట్ రౌండ్లోనే శ్రీసత్య, ఇనయా టికెట్ టు ఫినాలే ఛాన్స్ కోల్పోయారు. టాస్క్ లో ఓడి వారు పక్కకు తప్పుకున్నారు. అనంతరం కీర్తి కూడా టాస్క్ నుండి ఎలిమినేట్ అయ్యారు. 

మిగిలిన ఆదిరెడ్డి, రేవంత్, రోహిత్, శ్రీహాన్, ఫైమా టికెట్ టు ఫినాలే కోసం పోటీ పడుతున్నారు. ఇప్పటి వరకు బిగ్ బాస్ నిర్వహించిన టాస్క్స్ లో బెటర్ పెర్ఫార్మన్స్ ఇచ్చి ఆదిరెడ్డి 12 పాయింట్స్ తో టాప్ లో ఉన్నారు. అనంతరం శ్రీహాన్ రెండో స్థానంలో ఉండగా, మూడో స్థానంలో రేవంత్, నాలుగో స్థానంలో ఫైమా, ఐదవ స్థానంలో రోహిత్ కొనసాగుతున్నాడు. టాస్క్ బిగినింగ్ లో రేవంత్ టాప్ లో ఉన్నాడు. అయితే అనూహ్యంగా మూడో స్థానానికి పడిపోయాడు. 

The contenders have to choose three of them to be in the race for the 'Ticket to Finale' 🤯

Don't miss all the action tonight on , streaming 24/7 on . pic.twitter.com/K6CmSiWZNr

— starmaa (@StarMaa)

అబ్బాయిలతో ఫైమా పోటీపడుతూ ముందుకు వెళుతుంది. రోహిత్ మాత్రం నిరాశపరుస్తున్నాడు. అందరిలో ఫిజికల్ గా స్ట్రాంగ్ అయిన రోహిత్ టాస్క్లో ప్రతిసారి చేతులెత్తేస్తున్నాడు. మిగతా వారికి గట్టి పోటీ ఇవ్వలేకపోతున్నాడు. గతంలో కూడా ఒక ఫిజికల్ టాస్క్ లో తాళం తీయలేక శ్రీసత్య చేతిలో ఓడిపోయాడు. టికెట్ టు ఫినాలే ఆదిరెడ్డి గెలుచుకున్నాడని ప్రచారం జరిగింది. అయితే ఇంకా రిజల్ట్ రాలేదు. పోటీలో ఉన్న ఐదుగురు సభ్యుల నుండి నెక్స్ట్ టాస్క్ లో ముగ్గురు పోటీపడాల్సి ఉంది. టాస్క్ నుండి ఎలిమినేటైన ఇనయా, కీర్తి, శ్రీసత్య ఏ ముగ్గురు వెళ్లాలో తమ అభిప్రాయం చెప్పాలని బిగ్ బాస్ కోరాడు. దీంతో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ కొనసాగుతోంది. 

మరోవైపు ఈ వారం ఎలిమినేషన్ కి ఆరుగురు సభ్యులు నామినేట్ అయ్యారు. ఆదిరెడ్డి, రేవంత్, కీర్తి, ఫైమా, రోహిత్, శ్రీసత్యలలో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉంది. కాగా ఈ వారం ఇద్దరు ఎలిమినేట్ అవుతారనే ప్రచారం జరుగుతుంది. మరి చూడాలి ఈ వీకెండ్ ఏం జరుగుతుందో.. 
 

click me!