Bigg Boss Telugu 6: నిజమైన విజేత నీవే... రేవంత్ కి గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ 

Published : Dec 12, 2022, 04:42 PM IST
Bigg Boss Telugu 6: నిజమైన విజేత నీవే... రేవంత్ కి గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ 

సారాంశం

మూడు నెలలకు పైగా మానసికంగా, శారీరకంగా వేదన అనుభవించిన కంటెస్టెంట్స్ కి గొప్ప అనుభూతిని పంచాలని బిగ్ బాస్ డిసైడ్ అయ్యాడు. వాళ్లకు స్వీట్ సర్ప్రైజ్ ఇస్తున్నాడు. 


బిగ్ బాస్ సీజన్ 6కి ఇది చివరి వారం. నవంబర్ 18న గ్రాండ్ ఫినాలే జరగనుంది. హౌస్లో ఇకపై గొడవలు, చెమట చిందించాల్సిన టాస్కులు ఉండవు. ఒకరిపై మరొకరు  కాకరేపే కామెంట్స్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. తమ వ్యక్తిత్వం ఆడియన్స్ కి మరింత అర్థమయ్యేలా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఇక ఈ వారం ఓట్లు కంటెస్టెంట్స్ కి చాలా కీలకం. 14 వారాల ఓట్లతో సంబంధం లేకుండా ఈ వారం అధికంగా ఓట్లు సంపాదించిన కంటెస్టెంట్ విన్నర్ అవుతాడు. 

మూడు నెలలకు పైగా మానసికంగా, శారీరకంగా వేదన అనుభవించిన కంటెస్టెంట్స్ కి గొప్ప అనుభూతిని పంచాలని బిగ్ బాస్ డిసైడ్ అయ్యాడు. వాళ్లకు స్వీట్ సర్ప్రైజ్ ఇస్తున్నాడు. ప్రతి కంటెస్టెంట్స్ అందమైన బిగ్ బాస్ జర్నీతో కూడిన ఫోటోలు ఏర్పాటు చేసి, దీపపు కాంతుల మధ్య కంటెస్టెంట్స్ గురించి తెలియజేస్తున్నాడు. 

రేవంత్ గురించి బిగ్ బాస్ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశాడు. కోపం నీ వీక్నెస్, అది అనేక పొరపాట్లకు కారణమైంది. ఆ విషయాన్ని త్వరగా తెలుసుకొని అందుకు తగ్గట్లు మారి కోపాన్ని ఫ్యాషన్ గా మార్చుకున్నావు. నిజానికి జీవితంలో అన్ని భావోద్వేగాలు ఉన్నవారే నిజమైన విజేతలు. జీవితంలో తండ్రి అయ్యే అద్భుత క్షణాలు దగ్గరుండి అనుభవించే అవకాశాన్ని బిగ్ బాస్ కారణంగా కోల్పోయారు. మీ త్యాగానికి ప్రతిఫలం దక్కాలని, బిగ్ బాస్ ఫినాలేకు బిగ్ బాస్ తరపున ఆల్ ది బెస్ట్, అని చెప్పాడు. 

బిగ్ బాస్ ట్రీట్ కి రేవంత్ ఫిదా అయ్యాడు. కాగా ప్రస్తుతం హౌస్లో 6గురు కంటెస్టెంట్స్ ఉన్నారు. ఫైనల్ కి వెళ్ళేది మాత్రం ఐదుగురే. కాబట్టి మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని నాగార్జున ఆదివారం ఎపిసోడ్లో వెల్లడించారు. ఇంటి సభ్యుల్లో బుధవారం వరకు తక్కువ ఓట్లు వచ్చిన కంటెస్టెంట్ ని వారం మధ్యలో బయటకు పంపుతారు. ఈ విషయం కంటెస్టెంట్స్ కి తెలియదు. కాబట్టి ఇది మాస్టర్ స్ట్రోక్ అని చెప్పాలి. మిడ్ వీక్ ఎలిమినేటైన కంటెస్టెంట్ తీవ్ర మనోవేదనకు గురి కావడం ఖాయం!
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Dragon Glimpse: ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ ఊచకోత.. 4 నిమిషాలు అల్లాడించిన తారక్..
Darshan Thoogudeepa: ప్రపంచమంతా ఎదురొచ్చినా నిన్ను వదలను.. దర్శన్‌పై ఆయన భార్య ఎమోషనల్ పోస్ట్