Bigg Boss Telugu 6: విశ్వరూపం చూపించిన మెరీనా... నా జోలికి రావద్దంటూ గీతూపై ఫైర్!

Published : Oct 25, 2022, 12:55 PM ISTUpdated : Oct 25, 2022, 01:01 PM IST
Bigg Boss Telugu 6: విశ్వరూపం చూపించిన మెరీనా... నా జోలికి రావద్దంటూ గీతూపై ఫైర్!

సారాంశం

సాఫ్ట్ గా ఉండే మెరీనా బరస్ట్ అయ్యారు. కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో గీతూపై ఆమె ఫైర్ అయ్యారు. నా జోలికి రాకంటూ ఓ రేంజ్ లో రెచ్చిపోయింది.   

హౌస్లో సాఫ్ట్ గా కనిపించే మెరీనా విశ్వరూపం చూపించారు. కంటెస్టెంట్ గీతూపై మెరీనా ఫైర్ అయ్యారు. నాజోలికి రావద్దంటూ వార్నింగ్ ఇచ్చారు. నేడు మంగళవారం కాడంతో బిగ్ బాస్ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ స్టార్ట్ చేశారు. దీనిలో భాగంగా ఇంటి సభ్యులు చేపల చెరువు టాస్క్ ఆడాల్సి ఉంది. ఆకాశం నుండి చేపలు పడుతూ ఉంటాయి. వాటిని సేకరించి దాచుకోవాల్సి ఉంటుంది. ఈ టాస్క్ పెద్ద రసాబాసకు దారితీసింది. చేపలను సేకరించడానికి వాటిని బుట్టలో దాచుకోవడానికి కంటెస్టెంట్స్ ఒకరితో మరొకరు యుద్ధానికి దిగారు. 

అయితే మెరీనా-రోహిత్ ఆటను గీతూ తప్పుబట్టారు. మీరిద్దరూ కలిసి ఆడుతున్నారు ఇది అన్ ఫెయిర్ గేమ్ అన్నారు. బిగ్ బాస్ కలిసి ఆడమని చెప్పినప్పుడు విడివిడిగా ఆడారు. విడివిడిగా ఆడాలని చెప్పినప్పుడు కలిసి ఆడుతున్నారని గీతూ మండిపడింది. గీతూతో రోహిత్, మరీనా ఆర్గ్యుమెంట్ కి దిగారు. మెరీనా అయితే నా జోలికి రావద్దని గీతూకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. వస్తా అని గీతూ అనగా, అయితే రా చూసుకుందాం అంటూ మెరీనా భయపెట్టింది. 

సోమవారం నామినేషన్స్ ప్రభావం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో కనిపించింది. హౌస్లో మెజారిటీ సభ్యులు మెరీనా గేమ్ ఆడటం లేదంటూ నామినేట్ చేశారు. గీతూ సైతం మెరీనాను నామినేట్ చేశారు. అందరూ తాను గేమ్ ఆడటం లేదని నామినేట్ చేయడంతో మెరీనా ఫీల్ అయ్యారు. అదే సమయంలో సహనం కోల్పోయారు. నామినేషన్స్ లో మెరీనా, ఫైమా మధ్య కూడా సీరియస్ గొడవ జరిగింది. 

కాగా ఈ వారం మొత్తం ఇంటి సభ్యులు నామినేట్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటించారు. 14 మంది కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు. దీంతో వచ్చే వారం ఎలిమినేషన్ పై ఉత్కంఠ నెలకొంది. కాగా ఏడవ వారం అర్జున్ కళ్యాణ్ ఎలిమినేట్ అయ్యారు. అతి తక్కువ ఓట్లు సంపాదించిన అర్జున్ ఇంటిని వీడటం జరిగింది. అర్జున్ కళ్యాణ్ ఎలిమినేషన్ కంటెస్టెంట్ శ్రీసత్యను బాధపెట్టింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

5000 తో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చింది, ప్రస్తుతం 5 నిమిషాలకు 3 కోట్లు వసూలు చేస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Actor Sivaji: మహిళా కమిషన్‌ దెబ్బకి దిగొచ్చిన శివాజీ.. స్త్రీ అంటే మహాశక్తితో సమానం అంటూ క్షమాపణలు