#Kantara:‘కాంతారా’చూసి.. గుండెపోటుతో వ్యక్తి మృతి..!

Published : Oct 25, 2022, 11:07 AM IST
 #Kantara:‘కాంతారా’చూసి.. గుండెపోటుతో వ్యక్తి మృతి..!

సారాంశం

 కాంతార సినిమా చూడబోతున్నానని చెప్పి ఆనందంగా వెళ్లాడు. ఇప్పుడు సినిమా నుంచి వస్తుండగా మృతి చెందాడని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.


కన్నడలో సెప్టెంబర్ చివర్లో రిలీజ్ అయిన ‘కాంతారా’ చిత్రం… ఆ తర్వాత అక్టోబర్ 15న తెలుగుతో పాటు పలు భాషల్లో రిలీజ్ అయ్యింది.  కన్నడలో విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని ఆ తర్వాత తెలుగు , తమిళ్ , హిందీ భాషల్లో విడుదలై , బాక్స్ ఆఫీస్ వద్ద కనక వర్షం కురిపిస్తుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు అద్భుతంగా ఉందని , ఈ సినిమా ముందు ఏ బాహుబలి , కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ కూడా పనికిరాదని చెపుతున్నారు. ఇదిలా ఉంటె  తాజాగా ఈ సినిమా చూసి ఓ వ్యక్తి మృతి చెందడం ఇప్పుడు కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే..
  
కాంతార చిత్రం చూసి ఓ వ్యక్తి గుండెపోటుతో మరణించారు. మాండ్య జిల్లా నాగమంగళలోని వెంకటేశ్వర సినిమా వద్ద ఈ  ఘటన చోటుచేసుకుంది. కాంతారా  సినిమా చూసి బయటకు వస్తుండగా గుండెపోటుతో ఓ వ్యక్తి మృతి చెందాడు.  మృతుడు నాగమంగళ తాలూకాలోని సరిమేగలకొప్ప నివాసి  45 ఏళ్ల రాజశేఖర్. నిన్న వెంకటేష్ కాంతార సినిమా చూసేందుకు సినిమాకి వచ్చాడు.  కాంతార సినిమా చూస్తుండగా రాజశేఖర్‌కు ఛాతీ నొప్పి వచ్చింది. అక్కడే కుప్పకూలిపోయాడు. రాజశేఖర్ గుండెపోటుతో మృతి చెందినట్లు సమాచారం.
 
 కాంతార సినిమా చూడబోతున్నానని చెప్పి ఆనందంగా వెళ్లాడు. ఇప్పుడు సినిమా నుంచి వస్తుండగా మృతి చెందాడని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ మేరకు నాగమంగళ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.  

ఇక ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో ‘గీతా ఆర్ట్స్’ రిలీజ్ చేసింది. రిలీజైన తొలి రోజే ఈ మూవీ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. విమర్శకులు అయితే ఈ మూవీ ఓ రేంజిలో పొగుడుతూ  రేటింగ్ లు ఇచ్చారు. మొదటి రోజు మార్నింగ్ షోలు మ్యాట్నీలు కాస్త డల్ గా స్టార్ట్ అయినా ఈవెనింగ్ షోల నుండి ఈ మూవీ బాగా కలెక్ట్ చేస్తూ దూసుకుపోతోంది. దీంతో మొదటి రోజే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం 7వ రోజు కొత్త సినిమాలు రిలీజ్ అయినా అదే జోరుని చూపించింది.

ఇప్పటిదాకా కన్నడ వెర్షన్ మినహాయించి మిగతా భాషల్లో ఈ సినిమా 60 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. ఇది మామూలు విషయం కాదు. ఖచ్చితందా వంద కోట్లకు మరో వారంలో రీచ్ అయ్యిపోతుంది.  ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రం అని తేలిపోయింది.  కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చిన ఈ పాన్ ఇండియా ఫిల్మ్ ఇంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని ఎవరూ ఊహించలేదు.. భాషతో సంబంధం లేకుండా కాన్సెప్ట్ కీ, కల్చర్ కీ కనెక్ట్ అయ్యారు ఆడియన్స్.. దీంతో మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తో బాక్సాఫీస్ దుమ్ముదులుపుతోంది.
 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?