బిగ్ బాస్ 5 ప్రోమో వచ్చేసింది.. కాల్చి పడేసిన కింగ్ నాగ్

pratap reddy   | Asianet News
Published : Aug 14, 2021, 07:35 PM ISTUpdated : Aug 14, 2021, 07:38 PM IST
బిగ్ బాస్ 5 ప్రోమో వచ్చేసింది.. కాల్చి పడేసిన కింగ్ నాగ్

సారాంశం

అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. నాలుగు సీజన్ల పాటు వినోదం అందించిన బిగ్ బాస్.. ఇప్పుడు ఐదవ సీజన్ కోసం ముస్తాబవుతోంది. బిగ్ బాస్ 5వ సీజన్ ని కంఫర్మ్ చేస్తూ నిర్వాహకులు తాజాగా ప్రోమో విడుదల చేశారు.

అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. నాలుగు సీజన్ల పాటు వినోదం అందించిన బిగ్ బాస్.. ఇప్పుడు ఐదవ సీజన్ కోసం ముస్తాబవుతోంది. బిగ్ బాస్ 5వ సీజన్ ని కంఫర్మ్ చేస్తూ నిర్వాహకులు తాజాగా ప్రోమో విడుదల చేశారు. తొలి రెండు సీజన్లకు ఎన్టీఆర్, నాని హోస్ట్ గా వ్యవహరించగా.. ఆ తర్వాత కింగ్ నాగార్జున హోస్ట్ గా కొనసాగుతూ వచ్చారు. 

ఐదవ సీజన్ కు హోస్ట్ మారతారనే ఊహాగానాలకు తెరదించుతూ, అనుమానాల్ని పటాపంచలు చేస్తూ ఈసారి కూడా కింగ్ నాగార్జునే రంగంలోకి దిగాడు. ప్రోమోలో నాగ్ సూపర్ స్టైలిష్ గా కనిపించారు. రొటీన్ కి భిన్నంగా ఈ సారి సాంగ్ లాంటి ప్రోమోని రిలీజ్ చేశారు. 

సీజన్ 4 ముగిశాక ప్రజలంతా ఎంటర్టైన్మెంట్ లేక బోరింగ్ లో మునిగిపోతున్నట్లు చూపించారు. మిస్టర్ బోరింగ్ ప్రజలని ఆవహిస్తూ మరింత విసుగు తెప్పిస్తుంటాడు. ఎంటర్టైన్మెంట్ లేక బోరింగ్ తో వేగలేక దిక్కుతోచని స్థితిలో ఉన్న ప్రజలకు కింగ్ నాగ్ ఒక వెలుగులా కనిపిస్తారు. 

పవర్ ఫుల్ గన్ తో నాగ్ మిస్టర్ బోరింగ్ ని కాల్చి పడేసి బిగ్ బాస్ 5కి వెల్కమ్ చెబుతారు. ఇలా బిగ్ బాస్ 5 ప్రోమో ఆకట్టుకుంటోంది. 'బోరింగ్ కి చెప్పై గుడ్ బై.. వచ్చేసింది బిగ్ బాస్ సీజన్ 5' అనే ట్యాగ్ లైన్ తో ప్రోమో రిలీజ్ చేశారు. త్వరలోనే ప్రారంభం అవుతుంది అని చెప్పారు కానీ.. బిగ్ బాస్ 5 లాంచ్ అయ్యే డేట్ ని ఖరారు చేయలేదు. బహుశా త్వరలోనే ప్రకటిస్తారేమో. 

అయితే బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొనే కంటెస్టెంట్స్ వీళ్ళే అని కొందరు సెలెబ్రిటీల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వారిలో యాంకర్ రవి, నటి ప్రియా, ట్రాన్స్‏జెండర్ ప్రియాంక, యాంకర్ వర్షిణి, కార్తీక దీపం భాగ్య అలియాస్ ఉమ, నటి లహరి, నవ్వస్వామి, యూట్యూబర్ నిఖిల్, వీజే సన్నీ, ఆర్జే కాజల్, లోబో,సిరి హన్మంత్, ఆట సందీప్ భార్య జ్యోతి, యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్, శ్వేతల పేర్లు వినిపిస్తున్నాయి. మరి వీరిలో ఎంతమంది బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడతారో చూడాలి. 

 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode : దీప కు చెక్ పెట్టడానికి జ్యోత్స్న మాస్టర్ ప్లాన్, శ్రీధర్ బెయిల్ విషయంలో కార్తీక్ కు పోలీసుల షాక్
OTT Movies: ఒకవైపు రామ్ పోతినేని, మరోవైపు కీర్తి సురేష్..ఓటీటీలో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్మెంట్, కంప్లీట్ లిస్ట్