లహరిని బలిపశువుని చేసింది ఎవరు... వీడియో ప్రూఫ్ తో నిజం బయటపెట్టిన నాగార్జున

Published : Sep 25, 2021, 03:49 PM IST
లహరిని బలిపశువుని చేసింది ఎవరు... వీడియో ప్రూఫ్ తో నిజం బయటపెట్టిన నాగార్జున

సారాంశం

ఈ వారం రోజుల్లో కంటెస్టెంట్స్ మధ్య జరిగిన వివాదాలు, గొడవలు, నెలకొన్న అనుమానాలకు సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ప్రియ, రవి, లహరి మధ్య నెలకొన్న వివాదంలో ఎవరిది తప్పో, నాగార్జున(Nagarjuna) క్లారిటీ తెచ్చారు.   

ముచ్చటగా మూడు వారాలు పూర్తి చేసుకుంది బిగ్ బాస్ రియాలిటీ షో. నేడు శనివారం కావడంతో హోస్ట్ నాగార్జున రంగంలోకి దిగారు. ఇక ఈ వారం రోజుల్లో కంటెస్టెంట్స్ మధ్య జరిగిన వివాదాలు, గొడవలు, నెలకొన్న అనుమానాలకు సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ప్రియ, రవి, లహరి మధ్య నెలకొన్న వివాదంలో ఎవరిది తప్పో, నాగార్జున(Nagarjuna) క్లారిటీ తెచ్చారు. 


నామినేషన్స్ ప్రక్రియలో లహరి ప్రియను నామినేట్ చేయడం జరిగింది. అందుకు కారణంగా ప్రియ తనతో క్లోజ్ గా ఉండడం లేదని, చెప్పగా ప్రియ స్పందించారు. నువ్వు హౌస్ లోని బాయ్స్ తో బిజీగా ఉంటున్నావ్, నేను నీతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఎక్కడ ఇస్తున్నావని ప్రియ సీరియస్ కామెంట్ చేశారు. నన్ను ఎవరితో చూశావని లహరి ప్రియను అడుగగా, లేట్ నైట్ బాత్రూం దగ్గర రవిని హగ్ చేసుకోవడం చూశానని ప్రియ.. లహరి రవిలపై బాంబ్ పేల్చింది. 


ప్రియ కామెంట్స్ దుమారం రేపగా, లహరి, రవి తీవ్ర స్థాయిలో ఆమెపై విరుచుకుపడ్డారు. ఈ వివాదాన్ని ప్రస్తావిస్తూ నాగార్జున... ప్రియ రవిలను నిలదీశాడు. అదే సమయంలో లహరిని సీక్రెట్ రూమ్ కి పంపించి, ఓ వీడియో ప్లే చేసి చూపించారు. వీడియో చూసిన లహరిని, ప్రియ, రవిలలో ఎవరు తప్పు చేశారో క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు బయటికి వెళ్లి ఎవరిది తప్పు కాదో వాళ్ళని గట్టిగా కౌగిలించుకొని, తప్పు చేసినవారిని ప్రశ్నించాలని చెప్పాడు. 


ఇక ఈ వివాదంలో ప్రియ కంటే కూడా యాంకర్ రవిదే తప్పని తెలుస్తుంది. ప్రియ, లహరి, రవి వివాదంలో లహరిని విక్టిమ్ గా భావిస్తుండగా, నిజం తెలిసిన తరువాత ఆమె ఎలా ప్రవర్తిస్తారో చూడాలి. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: అలాంటి వాళ్ళు కప్ గెలిచినట్లు చరిత్రలో లేదు, ఈసారి బిగ్ బాస్ టైటిల్ ఎవరిదంటే ?
Kartik Aaryan: చెల్లి పెళ్లి వేడుకలో హంగామా చేసిన యంగ్ హీరో, సందడి మొత్తం అతడిదే.. వైరల్ ఫోటోస్