`బిగ్‌ బాస్‌` ఫేమ్‌ అజయ్‌ ఒక్క సినిమాకి మూడు బాధ్యతలు.. అదరగొడుతున్న `అజయ్‌ గాడు` టీజర్‌

Published : Sep 19, 2022, 11:10 PM IST
`బిగ్‌ బాస్‌` ఫేమ్‌ అజయ్‌ ఒక్క సినిమాకి మూడు బాధ్యతలు..  అదరగొడుతున్న `అజయ్‌ గాడు` టీజర్‌

సారాంశం

బిగ్‌ బాస్‌ నాన్‌ స్టాప్‌ తెలుగు షోలో పాల్గొని పాపులర్‌ అయిన అజయ్‌ తాజాగా హీరోగా నటించిన చిత్రం `అజయ్‌ గాడు`. తనే దర్శకత్వం వహించిన ఈ చిత్ర టీజర్‌ విడుదలైంది.

`బిగ్‌ బాస్‌ నాన్‌ స్టాప్‌` తెలుగు ఫేమ్‌ అజయ్‌ కుమార్‌ కతుర్వార్‌ హీరోగా దూకుడు పెంచాడు. `విశ్వక్` సినిమాతో మెప్పించిన ఆయన ఇప్పుడు బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలు చేస్తున్నారు. అందులో ఒకటి `అజయ్‌గాడు`. తన పేరుతోనూ ఈ చిత్రాన్ని రూపొందించడం విశేషం. అంతేకాదు తనే దర్శకత్వం వహిస్తూ నిర్మించడం మరో విశేషం. తాజాగా `అజయ్‌ గాడు` చిత్ర టీజర్‌ విడుదలైంది. అన్ని రకాల ఎమోషన్స్ మేళవింపుగా రూపొందిన ఈ టీజర్‌ ఆద్యంతం కట్టిపడేస్తుంది. 

`అజయ్ గాడు` పవర్ ప్యాక్డ్ టీజర్‌తో  మేకర్స్ అందరినీ ఆటపట్టించారు. అజయ్ కతుర్వార్ ప్రేమ గురించిన చమత్కారమైన డైలాగ్‌తో టీజర్ ప్రారంభమవుతుంది, అందులో అతను తన ప్రపంచాన్ని పరిచయం చేస్తాడు. అందరి దృష్టిని ఆకర్షించడానికి అద్భుతమైన విజువల్స్‌తో యాక్షన్‌లో అజయ్ కతుర్వార్ ఫ్లాష్ కట్స్ లో కనిపిస్తారు. టీజర్, యాక్షన్, రొమాన్స్ ,  ఎమోషన్‌ల పర్ఫెక్ట్ బ్యాలెన్స్‌తో అందరి ఆసక్తిని రేకెత్తించింది. 

మంచి నిర్మాణ విలువలు, ఇంటెన్స్ యాక్షన్, అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇంటెన్స్ లవ్ స్టోరీతో ఈ సినిమాని తెరకెక్కించినట్టు తెలుస్తుంది. ఈ ఉత్తేజకరమైన ప్రాజెక్ట్‌ను అజయ్ కర్తుర్వార్ దర్శకత్వం వహించడం విశేషం. చందనా కొప్పిశెట్టి సహకారంతో అజయ్ కుమార్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై స్వయంగా నిర్మించారు. అందాల భామలు భాను శ్రీ, శ్వేతా మెహతా కథానాయికలుగా నటిస్తున్నారు.

అజయ్ నాగ్ మరియు హర్ష హరి జాస్తి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ కొడకొండ్ల, మనీజేన, సుమంత్ బాబు, ప్రతీక్ సంగీతం అందించగా, నేపథ్య సంగీతాన్ని సిద్ధార్థ్ శివుని సమకూర్చారు. ఇప్పటికే విడుదలైన చిత్ర ఫస్ట్ లుక్‌ కి విశేషం స్పందన లభించింది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Biggest Flop Movie: ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్.. ఓటీటీ వాళ్ళు కూడా డీల్ రద్దు చేసుకున్న మూవీ ఇదే
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ