Biggboss telugu 5: ప్రియ ఇంట పెళ్లి సందడి హాజరైన బిగ్ బాస్ కంటెస్టెంట్స్

Published : Nov 22, 2021, 08:54 AM ISTUpdated : Nov 22, 2021, 08:57 AM IST
Biggboss telugu 5: ప్రియ ఇంట పెళ్లి సందడి హాజరైన బిగ్ బాస్ కంటెస్టెంట్స్

సారాంశం

బిగ్ బాస్ ఫేమ్ ప్రియ ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఈ వేడుకకు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఉమాదేవి, జస్వంత్,సరయు హాజరయ్యారు. వీరి రాకతో ఈ వేడుక ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి   

బుల్లితెరతో పాటు వెండితెరపై అనేక పాత్రలు చేస్తున్నారు నటి ప్రియ. ఇటీవల బిగ్ బాస్ (Biggboss telugu 5) షోలో పాల్గొన్న ఆమె ఇంట్లో పెళ్లి వేడుక జరిగింది.  ప్రియకు వరుసకు కూతురు అయ్యే లోహిత వివాహం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకలో ప్రియ పట్టు చీరలో చాలా గ్రాండ్ గా మెరిసిపోయారు. సాధారణంగా చాలా రిచ్ లుక్ లో కనిపించే ఆమె మరింత, అందంగా తయారయ్యారు. హైదరాబాద్ లో జరిగిన ఈ వేడుకకు తన తోటి కంటెస్టెంట్స్ ఉమాదేవి, సరయు, జస్వంత్ పాల్గొన్నారు. వీరిని ప్రియ ప్రత్యేకంగా ఆహ్వానించారు. 

బిగ్ బాస్ సెలబ్రిటీల రాకతో ఈ పెళ్లి స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. పెళ్లి బంధువులు అందరూ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో ఫోటోలు దిగడానికి పోటీపడ్డారని సమాచారం. సరయు మొదటివారమే ఎలిమినేట్ కాగా, ఉమాదేవి రెండవ వారం హౌస్ నుండి బయటికి వచ్చేశారు. ఇక జెస్సి పదవ వారం అనారోగ్యం కారణంగా, ఎలిమినేట్ కాకుండానే హౌస్ ని వీడాడు. 


ఇక ప్రియ (Priya) విషయానికి వస్తే కొన్ని చర్యల కారణంగా ఆమె హౌస్ ని త్వరగా వీడాల్సి వచ్చింది. నటిగా ఆమెకున్న పాపులారిటీ రీత్యా ఫైనల్ వరకు రీచ్ అవుతుందని అందరూ భావించారు. అయితే కొన్ని విషయాలపై ఆమె స్పందించిన తీరు, ప్రేక్షకులలో ఆమెను నెగిటివ్ చేసింది. ముఖ్యంగా సన్నీపై ఆమె తరచుగా గొడవలు పెట్టుకునేది. చెంప పగులుద్ది అనే ఘాటు వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. 

Also read హీరో కాదు కమెడీయన్ మాత్రమే..సన్నీని ఫూల్‌ని చేసిన నాగ్‌ అండ్‌ కో.. ప్రియాంక ఇజ్జత్‌ తీసిందిగా!
అలాగే యాంకర్ రవి, లహరి పై ఆమె దారుణమైన కామెంట్స్ చేశారు. లేట్ నైట్ బాత్ రూమ్ లో వారిద్దరూ హగ్ చేసుకుంటుంటే చూశానని, బాంబు పేల్చారు. ఈ కామెంట్స్ హౌస్ లో అనేక గొడవలకు కారణం అయ్యాయి. ఒక వేళ నిజంగా వాళ్ళు అలా హగ్ చేసుకున్నా, పబ్లిక్ లో కామెంట్స్ చేయడం, సంచలనంగా మారింది. ప్రియ 8వ వారం ఎలిమినేట్ కావడం జరిగింది. 

Also read Anee master Eliminated: రవిపై జోస్యం చెప్పిన అనీ మాస్టర్.. శ్రీరామ్‌ బ్రదర్‌ అంటూ సిరిపై హాట్‌ కామెంట్‌
 

PREV
click me!

Recommended Stories

Pahalgam Love Story Review: 'పహల్‌గామ్ లవ్ స్టోరీ' మూవీ రివ్యూ..లవ్ స్టోరీలో దేశభక్తి
Chennai Love Story OTT: ఐదు భాషల్లో చెన్నై లవ్ స్టోరీ స్ట్రీమింగ్.. ఓటీటీకి వచ్చేసిన కిరణ్ అబ్బవరం సినిమా