Anee master Eliminated: రవిపై జోస్యం చెప్పిన అనీ మాస్టర్.. శ్రీరామ్‌ బ్రదర్‌ అంటూ సిరిపై హాట్‌ కామెంట్‌

By Aithagoni RajuFirst Published Nov 22, 2021, 12:02 AM IST
Highlights

ఈ వారం అనీ మాస్టర్‌ ఎలిమినేట్‌ అయ్యారు. నాగార్జున వద్దకి స్టేజ్‌పైకి వెళ్లిన అనీ మాస్టర్ తన జర్నీని చూసుకుని కన్నీళ్లు పెట్టుకుంది. చాలా ఎమోషనల్‌ అయ్యింది. ఈ సందర్భంగా ఇంటి సభ్యుల్లో ఒక్కొక్కరి గురించి చెప్పింది.

బిగ్‌బాస్‌ తెలుగు 5(Bigg Boss Telugu 5)లో ఆదివారం ఎపిసోడ్‌లో అనీ మాస్టర్(Anee Master Eliminated))ఎలిమినేట్‌ అయ్యారు. ముందుగా లీక్‌ అయిన సమాచారం ప్రకారమే ఆమె హౌజ్‌ నుంచి వెళ్లిపోయారు. చివరగా ప్రియాంక, అనీ మాస్టర్‌ నిలవగా, గార్గెడ్‌ ఏరియాలో స్టెప్పు వేస్తూ చివరగా ఉన్న రెడ్‌ లైన్‌ని ఎవరు ముందుగా టచ్‌ చేస్తారో వాళ్లు ఎలిమినేట్‌ అయినట్టు లెక్క. దీంతో అనీ మాస్టర్‌ ఎవిక్టెడ్‌ అయినట్టు నాగార్జున తేల్చేశారు. దీంతో అనీ మాస్టర్‌, ప్రియాంక, సిరి అంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. రవి ముఖం వాడిపోయింది. శ్రీరామ్‌ సైతం డౌన్‌ అయిపోయాడు. 

ఇక నాగార్జున వద్దకి స్టేజ్‌పైకి వెళ్లిన అనీ మాస్టర్ తన జర్నీని చూసుకుని కన్నీళ్లు పెట్టుకుంది. చాలా ఎమోషనల్‌ అయ్యింది. ఈ సందర్భంగా ఇంటి సభ్యుల్లో ఒక్కొక్కరి గురించి చెప్పింది. ఇందులో ముందుగా రవి గురించి చెబుతూ చాలా ఎమోషన్‌ అయ్యింది. మొదటి నుంచి తనని బాగా చూసుకున్నాడని, బాగా మోటివేట్‌ చేసేవాడని, ఆయన్ని చాలా మిస్‌ అవుతున్నానని చెప్పింది అనీమాస్టర్‌. రవి సైతం ఎమోషనల్‌ అయ్యాడు. మిస్‌ యూ అక్కా అన్నారు. అయితే ఈ సందర్భంగా ఈ సీజన్‌లో రవి స్థానమేంటో చెప్పింది. టాప్‌ 3లో ఉంటాడని జోస్యం చెప్పింది అనీ మాస్టర్‌.

శ్రీరామ్‌ గురించి చెబుతూ, తనకు ఓ బ్రదర్‌ లాంటివాడని, మంచి ఫ్రెండ్‌ అని చెప్పింది. చాలా సపోర్ట్ చేసినట్టు తెలిపింది. షణ్ముఖ్‌ గురించి బోల్డ్ కామెంట్‌ చేసింది. షణ్ముఖ్‌ తనతో పెద్దగా కనెక్ట్ కాలేదని చెప్పింది. కానీ ఎప్పుడూ తేడా చూడలేదని తెలిపింది. సిరి గురించి చెబుతూ హాట్‌ కామెంట్‌ చేసింది. స్మాల్‌ పటాకా అంటూ, థౌజండ్‌ వాలా అంటూ ప్రశంసించింది. ప్రియాంకని బట్టర్‌ ఫ్లై లాగా పోల్చింది. హౌజ్‌లో జరిగిన విషయాలకు క్షమాపణలు తెలిపింది. కాజల్‌ గురించి చెప్పడానికి ఏం లేదని ఆల్‌ ది బెస్ట్ చెప్పింది. మానస్‌.. హౌజ్‌లో ఫ్రెండ్‌ కాలేకపోయామని, బయట మంచి ఫ్రెండ్స్ అవుదామని తెలిపింది. సన్నీ గురించి చెబుతూ, ఈ సీజన్‌లో ఫస్ట్ ఫ్రెండ్‌ అయిందే సన్నీనే అని చెప్పింది. సన్నీ స్పందిస్తూ అనీ మాస్టర్‌ తనతోనే ఫైట్ చేసేదని బాగా ఆడిందని తెలిపారు. 

అంతకు ముందు ఆదివారం ఎపిసోడ్‌లో ఇంటి సభ్యులకు ప్రశ్నల టాస్క్ నిర్వహించాడు నాగ్‌. ఇంటి సభ్యులను మరొకరు అడిగిన ప్రశ్నలను నాగ్‌ ఈ టాస్క్ లో అడిగారు. ఆ తర్వాత కొన్ని ట్యాగ్స్ ఇచ్చి వాటిని ఆ ట్యాగ్‌ ఎవరి సెట్‌ అవుతుందో చెప్పాలనే టాస్క్ ఇచ్చాడు. మరోవైపు ఈ రెండు టాస్క్ లు ఆద్యంతం ఎంటర్‌టైనింగ్‌ గా సాగాయి. ఈ రోజు ఎపిసోడ్‌లో `అనుభవించు రాజా` టీమ్‌ సందడి చేసింది. రాజ్‌తరున్‌, హీరోయిన్‌, సుదర్శన్‌ పాల్గొని నవ్వులు పూయించారు. తమ సినిమా ప్రమోట్‌ చేసుకున్నారు. ఫైనల్‌గా అనీ మాస్టర్‌ ఎలిమినేషన్‌తో పదకొండు వారాలు పూర్తయ్యాయి. అనీ మాస్టర్‌తోపాటు జెస్సీ, విశ్వ, లోబో, స్వేత వర్మ, ప్రియా, హమీద, నటరాజ్‌ మాస్టర్, లహరీ, ఉమాదేవి, సరయు ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హౌజ్‌లో సన్నీ, రవి, శ్రీరామ్‌, షణ్ముఖ్‌, సిరి, కాజల్‌, ప్రియాంక, మానస్‌ ఉన్నారు. 

also read: హీరో కాదు కమెడీయన్ మాత్రమే..సన్నీని ఫూల్‌ని చేసిన నాగ్‌ అండ్‌ కో.. ప్రియాంక ఇజ్జత్‌ తీసిందిగా!

click me!