బిగ్‌ బాస్‌ బిగ్ షాక్‌.. బాలాదిత్య ఎలిమినేటెడ్‌.. వాసంతి అందంపై సెటైర్లు

Published : Nov 12, 2022, 10:53 PM ISTUpdated : Nov 12, 2022, 11:30 PM IST
బిగ్‌ బాస్‌ బిగ్ షాక్‌.. బాలాదిత్య ఎలిమినేటెడ్‌.. వాసంతి అందంపై సెటైర్లు

సారాంశం

 ఈ పదోవారం మరోసారి షాకిచ్చారు. ఈ శనివారం బాలాదిత్యని ఎలిమినేట్‌ చేశారు. అంత సేపు డాక్టర్‌, పేషెంట్‌ గేమ్‌ ఆడించిన హోస్ట్ నాగార్జున చివర్లో ఊహించని విధంగా స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌గా ఉన్న బాలాదిత్యని ఎలిమినేట్‌ చేయడంతో అంతా షాక్‌ అయ్యారు.

బిగ్‌ బాస్‌ 6 తెలుగులో ఊహించని ట్విస్ట్ లు, షాక్ లకు తెరలేపుతున్నారు బిగ్‌ బాస్‌. ఈ వారం ఎలిమినేషన్ శనివారమే తీసుకున్నారు. షో ప్రారంభంలో ఓ సారి, మధ్యలో మరోసారి ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా ఈ పదోవారం మరోసారి షాకిచ్చారు. ఈ శనివారం బాలాదిత్యని ఎలిమినేట్‌ చేశారు. అంత సేపు డాక్టర్‌, పేషెంట్‌ గేమ్‌ ఆడించిన హోస్ట్ నాగార్జున చివర్లో ఊహించని విధంగా స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌గా ఉన్న బాలాదిత్యని ఎలిమినేట్‌ చేయడంతో అంతా షాక్‌ అయ్యారు. ప్రింటెడ్‌ పేపర్‌లో వచ్చిన బాలాదిత్య ఫోటోని చూపించి జస్ట్ ఎలిమినేట్‌ అని చెప్పడంతో అంతా షాక్‌ అయ్యారు. ఎలిమినేషన్స్ ప్రక్రియలో ఏం జరుగుతుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

సడెన్‌గా బాలాదిత్యని ఎలిమినేట్‌ చేయడంతో ఇంటి సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. అంతా మూగబోయారు. బాలాదిత్య మాత్రం తన బాధని దిగమింగుకుని నవ్వులు చిందించడం విశేషం. ఇక స్టేజ్‌పైకి వచ్చిన బాలాదిత్య జర్నీ ఆద్యంతం ఎమోషనల్‌గా సాగడం విశేషం. అంతేకాదు హౌజ్‌ మేట్స్ మార్చుకోవాల్సిన విషయాలు చెప్పమనే టాస్క్ ఇవ్వగా ఒక్కొక్కొరి గురించి చెప్పుకొచ్చాడు బాలాదిత్య. 

ఆదిరెడ్డి గురించి చెబుతూ, బెస్ట్ పర్సన్ అని, కాన్ఫిడెంట్‌గా మాట్లాడాలని తెలిపారు. ఫైమా గురించి చెబుతూ, స్ట్రాటజీలు వాడొచ్చని, కాకపోతే అవి ఫెయిరా? అన్‌ ఫెయిరా అనేది చూసుకోవాలని, జనం చూస్తున్నారని, మన గురించి తప్పుగా అనుకుంటారని, అది మార్చుకోవాలని తెలిపారు. రాజ్‌ ప్రారంభం నుంచి చాలా ఎదుగుతూ వస్తున్నాడని, గ్రాఫ్‌ బాగుందని, కాకపోతే మాటల్లో క్లారిటీ ఉండాలని తెలిపారు. రోహిత్‌.. బ్యాలెన్స్ తప్పొద్దని, సెటిల్డ్ గా ఆలోచించి మాట్లాడాలని తెలిపారు. మెరీనాని ఇండిపెండెంట్‌గా ఆడాలని చెప్పాడు. 

శ్రీ సత్య.. తనకు చెల్లమ్మలాంటిదని, తనకు గోరు ముద్దలు తినిపించిందన్నారు. మాట తీరు, ఆట తీరు మార్చుకోవాలని తెలిపారు. శ్రీహాన్‌ స్మార్ట్ ప్లేయర్‌ అని, ఆలోచించి ఆడాలని, బ్యాలెన్స్ తప్పొదని పేర్కొన్నాడు. రేవంత్‌ గురించి చెబుతూ, అతి రౌద్రం అని, అది పక్కన పెడితే చిన్న పిల్లాడు అని, ఆవేశం తగ్గించుకోవాలని, జాగ్రత్తగా మాట్లాడాలని తెలిపారు. ఆట, మాట కంట్రోల్‌గా ఉండాలన్నారు. ఇనయ.. మాటతీరు, ఆలోచన ట్రాక్‌ తప్పుతుందన్నారు. తనకు మాత్రమే తప్పుని తప్పు అని చెప్పే ధైర్యముందన్నారు.

కీర్తి గురించి చెబుతూ, లోపల డైమండ్ అని, ఇతరుల గురించి ఆలోచించి ఆట ఆడుతుందని, తనకోసం ఆడాలని తెలిపారు. వాసంతి గురించి చెబుతూ చురకలు అంటించాడు బాలాదిత్య. స్మాల్ గర్ల్ అని, ఓడిపోతే అతిగా బాధ పడిపోతుందన్నారు. అదే సమయంలో హౌజ్‌లో నీ అప్పీయరెన్స్ గ్లామర్‌ పరంగానే కాదని, గ్రామర్‌ కూడా బాగుండాలని, ఆ దిశగా ఫోకస్‌ పెంచాలన్నారు. ఇలా అందరి గురించి చెబుతూ గుడ్‌ బై చెప్పాడు బాలాదిత్య. 

షో మొదట్లో పెద్దరికంతో ఆకట్టుకున్న బాలాదిత్య ఆ తర్వాత డల్‌ అవుతూ వస్తున్నాడు. ఆయన ఆట కూడా స్పెషల్‌ గా అనిపించలేదు. అందరికంటే వెనకబడి పోతున్నాడు. చాలా వరకు స్పీచ్‌లకే పరిమితమయ్యారనే ఆరోపణలున్నాయి. ఇవే ఆయన ఎలిమినేషన్‌కి కారణమని తెలుస్తుంది. బట్‌ ఆయన గొప్ప మనిషి అంటూ ఆయన అభిమానులు సోషల్‌ మీడియాలో ట్రెండ్ చేయడం విశేషం.


 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు