
ఇనాయ సుల్తానా పరిచయం అక్కర్లేని పేరు. బిగ్ బాస్ సీజన్ 6 వేదికగా అమ్మడు రచ్చ చేసింది. ఇనాయకు బిగ్ బాస్ భారీ ఫేమ్ తెచ్చి పెట్టింది. ఆమె హౌస్లో ఒంటరిగా గేమ్ ఆడింది. తప్పు ఎవరు చేసినా నిలదీసేది. ఒక దశలో టైటిల్ ఫేవరేట్ గా ప్రచారం అయ్యింది. ఇనాయ ఎఫైర్ కూడా నడిపింది. ఆర్జే సూర్యను ఘాడంగా ప్రేమించింది. వీరి ప్రేమ శృతి మించడంతో గేమ్ కూడా వదిలేశారు. హోస్ట్ నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడంతో కొంచెం డిస్టెన్స్ పాటించారు.
సూర్య 8వ వారం ఎలిమినేట్ అయ్యాడు. దాంతో ఇనాయ గుక్క పట్టి ఏడ్చింది. సూర్య ఎలిమినేట్ అయిన వారం ఇనాయ అతన్ని నామినేట్ చేయడం కొసమెరుపు. సూర్య ఎలిమినేట్ అయ్యాక ఇనాయ ఎలాంటి ఎఫైర్స్ పెట్టుకోలేదు. ఫైనల్ కి వెళ్లే ఛాన్స్ కొంచెం లో చేజార్చుకున్న ఇనాయ 14వ వారం ఎలిమినేట్ అయ్యింది. ఇనాయ ఎలిమినేషన్ అన్ ఫెయిర్ అని సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ దర్శనం ఇచ్చాయి.
హౌస్ నుండి బయటకు వచ్చాక ఆర్జే సూర్యను ఇనాయ పెద్దగా కలవకపోవడం ఆసక్తికర పరిణామం. అంటే ఇనాయ హౌస్లో చేసిందంతా నటనే అని జనాలకు క్లారిటీ వచ్చింది. ఇనాయకు ఫేమ్ వచ్చినప్పటికీ పెద్దగా మూవీ ఆఫర్స్ రావడం లేదు. ఆమె సోషల్ మీడియాలో గ్లామర్ క్వీన్ గా అవతరించింది. హాట్ ఫోటో షూట్స్ తో మైండ్ బ్లాక్ చేస్తుంది.
తాజాగా ప్రియుడి పరిచయం చేసి షాక్ ఇచ్చింది. అతనితో పాటు గోవా వెళ్లిన ఇనాయ ఫుల్ గా చిల్ అవుతుంది. అతనితో దిగిన ఫోటోలు, వీడియోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తుంది. ఇనాయతో ఉన్న వ్యక్తి పేరు గౌతమ్ కొప్పిశెట్టి అని సమాచారం. ఇతడు జిమ్ ట్రైనర్. అలాగే యోగ ఎక్స్పర్ట్ అట. జిమ్ లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందట. ఇక ఇనాయ-గౌతమ్ ఫోటోల క్రింద నెటిజెన్స్ పలు కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లి వరకు వెళ్లే బంధంగా లేక, ఎంజాయ్ చేసి ఎవరి దారి వారు చేసుకుంటారా? అని ప్రశ్నిస్తున్నారు.