'బిగ్ బాస్ 3' లేటెస్ట్ ప్రోమో.. హోస్ట్ ఎవరో గుర్తుపట్టారా..?

Published : Jun 21, 2019, 09:57 AM IST
'బిగ్ బాస్ 3' లేటెస్ట్ ప్రోమో.. హోస్ట్ ఎవరో గుర్తుపట్టారా..?

సారాంశం

బుల్లితెర నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతుంది బిగ్ బాస్. తెలుగులో ఇప్పటికే రెండు సీజన్ లను పూర్తి చేసుకున్న ఈ షో బిగ్ బాస్ మూడో సీజన్ కి సిద్ధమవుతోంది. 

బుల్లితెర నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతుంది బిగ్ బాస్. తెలుగులో ఇప్పటికే రెండు సీజన్ లను పూర్తి చేసుకున్న ఈ షో బిగ్ బాస్ మూడో సీజన్ కి సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ షోకి సంబంధించిన కంటెస్టంట్ల పేర్లు బయటకి వచ్చాయి.

హోస్ట్ గా నాగార్జున చేయబోతున్నారనే వార్తలు వినిపించాయి. ఇటీవల ఈ షోకి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు. అయితే అందులో షో ఎప్పుడు మొదలవుతుందనే  వివరాలను మాత్రం తెలపలేదు. తాజాగా ఈ షోకి సంబంధించిన మరో ప్రోమో విడుదలైంది.

ఈ ప్రోమోలో కాస్త సస్పెన్స్ ని మైంటైన్ చేస్తూ.. హోస్ట్ ఫేస్ ని చూపించకుండా జాగ్రత్త పడ్డారు. అయితే ఆ హోస్ట్ నడకతీరు, ఫిజిక్ చూసి నాగార్జునే అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. వచ్చే నెల నుండి ఈ షో మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

PREV
click me!

Recommended Stories

MSG Collections: చిరంజీవి `మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీ 16 రోజుల కలెక్షన్లు.. 80 కోట్లు తేడా?, అయినా రికార్డు
Aditi Shankar: డైరెక్టర్ శంకర్ కూతురు లేటెస్ట్ లుక్ చూశారా ? పూర్తిగా మారిపోయింది