'బిగ్ బాస్ 3' ప్రోమో వచ్చేసింది!

Published : Jun 17, 2019, 10:59 AM IST
'బిగ్ బాస్ 3' ప్రోమో వచ్చేసింది!

సారాంశం

బుల్లితెర రియాలిటీ షో 'బిగ్ బాస్' ఎంత పాపులరో తెలిసిందే. తెలుగులో రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో మూడో సీజన్ కి సిద్ధమవుతోంది. 

బుల్లితెర రియాలిటీ షో 'బిగ్ బాస్' ఎంత పాపులరో తెలిసిందే. తెలుగులో రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో మూడో సీజన్ కి సిద్ధమవుతోంది. కంటెస్టంట్ లు వీళ్లే అంటూ ఓ లిస్ట్ కూడా బయటకి వచ్చింది.

హోస్ట్ గా నాగార్జున కన్ఫర్మ్ అయినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియడం లేదు. ఇది ఇలా ఉండగా.. ఈ షో ఇప్పటివరకు మొదలుకాకపోవడం, ఎలాంటి అధికార ప్రకటన రాకపోవడంతో షోపై అనుమానాలు వ్యక్తం చేశారు.

అసలు 'బిగ్ బాస్ 3' ఉంటుందా..? ఉండదా..? అనే సందేహాలు వ్యక్తం చేశారు. ఈ అనుమానాలకు తెర దించుతూ స్టార్ మా యాజమాన్యం ఓ ప్రోమో విడుదల చేసింది. 'బిగ్ బాస్ 3' త్వరలోనే ప్రారంభం కాబోతుందంటూ ఓ ప్రోమోని వదిలారు.

అయితే షో ఎప్పుడు మొదలవుతుందనే విషయాన్ని మాత్రం స్పష్టం చేయలేదు. 'త్వరలోనే బిగ్ బాస్ 3' అంటూ తెలిపారు. మొత్తానికి బిగ్ బాస్ షో ఉంటుందనే విషయంలో క్లారిటీ వచ్చేసింది. ఇక కంటెస్టంట్ లు, షో ఎప్పుడు మొదలవుతుందనే విషయాలు తెలియాల్సివున్నాయి. 

 

PREV
click me!

Recommended Stories

Chiranjeevi: చిరంజీవి అంటే ఏంటో ఇండస్ట్రీకి చూపించిన 5 సినిమాలు..ఇవి లేకుంటే మెగాస్టార్ కెరీర్ ఫినిష్
Mana Shankara Vara Prasad Garu OTT Release : ఓటీటీలో మన శంకర వరప్రసాద్ గారు వచ్చేది ఎప్పుడో తెలుసా? ఎక్కడ చూడొచ్చంటే?