బిగ్ బాస్ 3: ఎలిమినేషన్ కాదు రీఎంట్రీ.. అలీ తిరిగొస్తాడా..?

Published : Sep 17, 2019, 11:29 AM ISTUpdated : Sep 17, 2019, 11:30 AM IST
బిగ్ బాస్ 3: ఎలిమినేషన్ కాదు రీఎంట్రీ.. అలీ తిరిగొస్తాడా..?

సారాంశం

ఎనిమిది వారాలను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్‌ చేసుకున్న బిగ్‌బాస్‌ షో.. తొమ్మిదో వారంలోకి అడుగుపెట్టేసింది. అయితే ఇప్పటివరకు ఏడు ఎలిమినేషన్స్‌, రెండు వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీలు జరిగాయి.   

ఎనిమిది వారాలు విజయవంతంగా పూర్తి చేసుకొని తొమ్మిదో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది బిగ్ బాస్ షో. అయితే ఇప్పటివరకు షోలో ఏడుగురు ఎలిమినేట్ అయ్యారు. రెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు జరిగాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్ లోకి వచ్చిన తమన్నా, శిల్పా ఎక్కువరోజులు హౌస్ లో ఉండలేకపోయారు.

ఇక సోమవారం నాటి ఎపిసోడ్ లో ఎప్పటిలానే బిగ్ బాస్ నామినేషన్ ప్రాసెస్ మొదలుపెట్టారు. సాధారణంగా అయితే సోమవారం నాడే నామినేషన్ ప్రక్రియ పూర్తై ఓటింగ్ మొదలవుతుంది. కానీ నిన్న ఓటింగ్ లైన్లు తెరుచుకోలేదు. ఎందుకంటే నామినేషన్ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. నిన్నటి ఎపిసోడ్ లో మహేష్ మాత్రం నామినేషన్ లోకి వచ్చాడు.

ఈరోజు కూడా నామినేషన్ ప్రక్రియ కొనసాగనుంది. అయితే ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియ ఉండదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన కంటెస్టంట్లను తిరిగి తీసుకురావడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. వీరికోసం ఓటింగ్ చేపట్టనున్నారని టాక్. అదే గనుక నిజమైతే అలీ రెజాకు అందరికంటే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది.

ఇప్పటికే సోషల్ మీడియాలో అలీ స్ట్రాంగ్ కంటెస్టంట్ అని అతడు తిరిగి హౌస్ లోకి రావాలని కోరుకుంటున్నారు. రోహిణి కూడా అనవసరంగా ఎలిమినేట్ అయిందనే అభిప్రాయం కొందరిలో ఉంది. గత సీజన్ లో రీఎంట్రీ పెట్టినప్పుడు శ్యామల, నూతన్ నాయుడు ఇద్దరూ హౌస్ లోకి వెళ్లారు. మరి ఈసారి కూడా అలా ఇద్దరు కంటెస్టంట్లు హౌస్ లోకి వెళ్తారేమో చూడాలి!

 

PREV
click me!

Recommended Stories

Nagarjuna తో పోటీకి దిగి.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అల్లరి నరేష్, ఇంతకీ ఆమూవీ ఏదో తెలుసా?
Savitri: మహానటి జీవితం నాశనం కావడానికి జెమినీ గణేషన్‌, పొలిటీషియన్‌ మాత్రమే కాదు, ఆ మూడో వ్యక్తి ఇతడేనా?