బిగ్ బాస్ 3: కెప్టెన్‌గా మహేష్ విట్టా.. బాబా భాస్కర్ ని ఓడించి!

By AN TeluguFirst Published Sep 20, 2019, 7:47 AM IST
Highlights

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సక్సెస్ ఫుల్‌గా 60 ఎపిసోడ్‌లను పూర్తి చేసి గురువారం నాటితో 61వ ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. ఈ ఎపిసోడ్ హైలైట్స్ మీకోసం.

బిగ్ బాస్ సీజన్ 3 తొమ్మిదో వారంలో మహేష్ కెప్టెన్ గా నిలిచారు. బిగ్ బాస్ ఇచ్చిన క్రేజీ కాలేజ్ టాస్క్‌లో బెస్ట్ టీజర్‌, బెస్ట్ స్టూడెంట్‌ను ఏకాభిప్రాయంతోచెప్పాలని బిగ్ బాస్ హౌస్ మేట్స్ ని కోరగా.. స్టూడెంట్స్ అందరూ బాబా భాస్కర్ పేరు చెప్పారు. వితికా, వరుణ్, బాబా భాస్కర్‌ లు బెస్ట్ స్టూడెంట్‌గా మహేష్‌ని ఎన్నుకున్నారు.

బెస్ట్ స్టూడెంట్, బెస్ట్ టీచర్‌లుగా ఎన్నికైన బాబా భాస్కర్, మహేష్‌ విట్టా కెప్టెన్సీ టాస్క్ కి అర్హులని బిగ్ బాస్ ప్రకటించారు. ఈ టాస్క్ లో భాగంగా ‘ప్రచారమే ఆయుధం’ అనే ఇంట్రస్టింగ్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్ ప్రకారం మహేష్ విట్టా, బాబా భాస్కర్‌లు మిగిలిన ఇంటి సభ్యుల దగ్గరకు వెళ్లి తమని కెప్టెన్‌గా ఎన్నుకోవాలని అడగాలి.

వీరి ప్రచారం తమకు నచ్చితే హౌస్ మేట్స్ వద్ద ఉన్న దండను తీసి మహేష్, బాబాల మెడలో వేయాలి. ఈ క్రమంలో ఎనిమిది మందిలో ఎక్కువ ఓట్లు మహేష్ విట్టాకే రావడంతో బాబా భాస్కర్‌ ని ఓడించి హౌస్ కెప్టెన్ గా నిలిచారు.

ఇక గురువారం నాటి ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ కుటుంబసభ్యులను ఒక రూమ్ లో ఉంచి వారితో టాస్క్ ఆడించాడు బిగ్ బాస్. వారిలో గెలిచినవారు హౌస్ లోకి వెళ్లి తమ కుటుంబసభ్యులను కలిసే ఛాన్స్ కల్పించారు. ఆ ఎపిసోడ్ శుక్రవారం నాడు కూడా కంటిన్యూ అవ్వనుంది. 

 

click me!