'ఛత్రపతి' టీజర్ ఇదిగో.. శక్తినంతా కూడబెట్టి యాక్షన్ డోస్ పెంచిన బెల్లంకొండ శ్రీనివాస్

By Asianet NewsFirst Published Mar 30, 2023, 4:37 PM IST
Highlights

కెరీర్ ఆరంభం నుంచి బెల్లంకొండ శ్రీనివాస్ వరుసగా యాక్షన్ చిత్రాలే చేస్తున్నాడు. ఫలితాలతో సంబంధం లేకుండా మాస్ హీరో అనిపించుకునేందుకు గట్టి ప్రయత్నం చేశాడు. ప్రభాస్, రాజమౌళి కాంబోలో వచ్చిన మొదటి చిత్రం ఛత్రపతిని హిందీలో బెల్లంకొండ శ్రీనివాస్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. 

కెరీర్ ఆరంభం నుంచి బెల్లంకొండ శ్రీనివాస్ వరుసగా యాక్షన్ చిత్రాలే చేస్తున్నాడు. ఫలితాలతో సంబంధం లేకుండా మాస్ హీరో అనిపించుకునేందుకు గట్టి ప్రయత్నం చేశాడు. కానీ బెల్లంకొండ శ్రీనివాస్ కి సాలిడ్ హిట్ అయితే దక్కలేదు. కానీ మాస్ ఆడియన్స్ లో బెల్లంకొండ హీరోకి కొంత ఫాలోయింగ్ ఏర్పడింది. ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ లో ప్రయత్నాలు మొదలు పెట్టాడు. 

ప్రభాస్, రాజమౌళి కాంబోలో వచ్చిన మొదటి చిత్రం ఛత్రపతిని హిందీలో బెల్లంకొండ శ్రీనివాస్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని డైరెక్టర్ వివి వినాయక్ తెరకెక్కిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని హిందీలో రిలీజ్ చేసిన పెన్ స్టూడియోస్ సంస్థ ఈ మూవీని నిర్మిస్తోంది. 

తాజాగా ఛత్రపతి పవర్ ప్యాక్డ్ టీజర్ రిలీజ్ చేశారు. రీమేక్ మూవీ కాబట్టి ఒరిజినల్ వర్షన్ తో పోలిక ఉంటుంది. అలా చూస్తే బెల్లంకొండ శ్రీనివాస్ ఛత్రపతిలో యాక్షన్ డోస్ పెరిగింది అంతే. టీజర్ లో చూపిన సన్నివేశాలు అన్నీ ఒరిజినల్ వర్షన్ లో ఉన్నట్లే ఉన్నాయి. అయితే బెల్లకొండ శ్రీనివాస్ మాత్రం తన శక్తినంతా కూడబెట్టుకుని పవర్ ఫుల్ స్క్రీన్ ప్రజెన్స్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. 

తెలుగు ఆడియన్స్ కి ఈ టీజర్ కొత్తగా అనిపించదు కానీ ఛత్రపతి చూడని హిందీ ఆడియన్స్ లో మాత్రం మంచి అటెన్షన్ తీసుకుంటుంది. టీజర్ లో చూపిన యాక్షన్ షాట్స్ మెప్పించే విధంగా ఉన్నాయి. బిజియం మాత్రం అంత గొప్పగా లేదు. మరి ఈ టీజర్ తో బాలీవుడ్ లో ఛత్రపతిపై బజ్ పెరుగుతుందో లేదో చూడాలి. 

 

click me!