Video: తాటి కల్లు, పొట్టేళ్లు... ఆ ఊరిలో దావత్ చేసుకున్న బలగం టీమ్!

By Sambi ReddyFirst Published Mar 30, 2023, 5:03 PM IST
Highlights

దర్శకుడు వేణు ఎల్దండితో పాటు ఎంటైర్ బలగం టీం ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ సందర్భంగా మాంచి దావత్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. 
 

బలగం మూవీ టీం పిచ్చ హ్యాపీగా ఉన్నారు. ఊహించని స్థాయిలో సినిమా విజయం సాధించింది. వరల్డ్ వైడ్ బలగం రూ. 22 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం. ఈ చిత్ర బడ్జెట్ రీత్యా ఇవి భారీ వసూళ్ళని చెప్పాలి. అందులోనూ ఎలాంటి స్టార్ క్యాస్ట్ లేకుండా కేవలం కంటెంట్ ఆధారంగా సక్సెస్ అయ్యింది. ఒక మంచి సినిమాను థియేటర్స్ లో ప్రేక్షకులు ఆదరించడం గొప్ప పరిణామం.

బలగం మూవీ నిర్మాతలకు భారీగా లాభాలు తెచ్చిపెట్టింది. దీంతో బలగం టీమ్ కి దావత్ ఇచ్చారు. ఈ పార్టీకి వేదికగా సిరిసిల్ల సమీపంలో గల పల్లెటూరిని ఎంచుకున్నారు. సినిమాలో కాకి ముట్టుడు సీన్ తెరకెక్కించిన చెట్టు కింద దావత్ చేసుకున్నారు. ఈ పార్టీకి సంబంధించిన వీడియో వేణు ఎల్దండి తన యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేశారు. చిత్రంలో ప్రధాన పాత్రలు చేసిన ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ తో పాటు నటులందరూ ఈ దావత్ కి హాజరయ్యారు. 

పార్టీ కోసం పొట్టేళ్లు తెచ్చారు. కల్లు తాగారు. ఇక ఈ పార్టీకి సంబంధించిన పూర్తి వీడియో త్వరలో అప్లోడ్ చేస్తానని వేణు కామెంట్ చేశారు.  చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించింది బలగం. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు ప్రేక్షకులు మదిలో గుర్తుండిపోతాయి. పెద్దగా పేరున్న నటుల కాకపోయినా చాలా సహజంగా నటించి మెప్పించారు. సాయిలు, కొమురయ్య, ఐలయ్య, నారాయణ, లక్ష్మితో పాటు మరికొన్ని పాత్రలు ప్రేక్షకులను వెంటాడుతాయి.కాగా బలగం మూవీ కథ నాదే అంటూ జర్నలిస్ట్ సతీష్ గడ్డం మీడియా ముందు ఆరోపణలు చేశారు. గతంలో నేను రాసిన పుచ్ఛిక అనే కథకు మార్పులు చేసి బలగం మూవీ తీశారంటూ ఆయన ఆరోపించారు.

గడ్డం సతీష్ ఆరోపణలు ఖండించిన వేణు... ఆయన కథ నేను చదివింది లేదు. ఆరేళ్ళు నేను రీసెర్చ్ చేసి రాసుకున్న కథ అని చెప్పుకొచ్చారు. ఎక్కడ చూసినా బలగం మూవీ గురించే చర్చ నడుస్తుంది. సినిమా గొప్పగా ఉందంటూ కొనియాడుతున్నారు. దర్శకుడు వేణు ఎల్దండి పేరు మారుమ్రోగుతుంది. ఈ పల్లెటూరి ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా బాక్సాఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేసింది. దిల్ రాజు మూవీస్ బ్యానర్ లో హన్షిత, హర్షిత్ రెడ్డి బలగం చిత్రం నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. 

click me!