బిగ్ బాస్ హౌస్.. మళ్లీ ఏడ్చిన శ్రీశాంత్

Published : Dec 08, 2018, 04:56 PM IST
బిగ్ బాస్ హౌస్.. మళ్లీ ఏడ్చిన శ్రీశాంత్

సారాంశం

హౌజ్ లో అడుగుపెట్టిన నాటి నుంచి తన కోపంతో, యాటిట్యూడ్ తో వివాదాలకు కేంద్రంగా మారాడు. దీంతో.. ఎప్పుడూ.. ఎవరో ఒకరు హౌజ్ మేట్స్.. శ్రీశాంత్ పై విమర్శలు చేస్తూనే ఉన్నారు.

మాజీ టీంఇండియా క్రికెటర్ శ్రీశాంత్.. మరోసారి బిగ్ బాస్ హౌస్ లో ఏడ్చేశారు. ఆయన ప్రస్తుతం సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 12లో పార్టిసిపేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. హౌజ్ లో అడుగుపెట్టిన నాటి నుంచి తన కోపంతో, యాటిట్యూడ్ తో వివాదాలకు కేంద్రంగా మారాడు. దీంతో.. ఎప్పుడూ.. ఎవరో ఒకరు హౌజ్ మేట్స్.. శ్రీశాంత్ పై విమర్శలు చేస్తూనే ఉన్నారు.

అయితే.. శ్రీశాంత్ పై వస్తున్న విమర్శలపై హోస్ట్ సల్మాన్ ఖాన్ మండిపడ్డారు. శ్రీశాంత్ కి మద్దతుగా నిలిచినట్లు తెలుస్తోంది. దీంతో.. శ్రీశాంత్ వెక్కి వెక్కి ఏడ్చినట్లు  కలర్స్ టీవీ విడుదల చేసిన ప్రోమోలో తెలుస్తోంది.

లగ్జరీ బడ్డెట్‌ టాస్క్‌లో భాగంగా హౌస్‌మెట్స్‌ శ్రీశాంత్‌ పట్ల వ్యవహరించిన తీరుపై సల్మాన్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. శ్రీశాంత్‌ క్రికెటర్‌గా భారత జట్టుకు ఎంతో చేశాడని, అతని గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారని రోహిత్‌, సురభిలపై మండిపడ్డాడు. అతనికి బిగ్‌బాస్‌లో ఎదురైన అనుభవాలను గుర్తుచేస్తూ.. అతనితో హౌస్‌మేట్స్‌ వ్యవహరించిన తీరును చూపిస్తూ.. ఓ వ్యక్తిగా వాటిని తట్టుకోవడం చాలా కష్టామని పేర్కొన్నాడు. సల్మాన్  నుంచి మద్దతు రావడంతో.. ఆనందం తట్టుకోలేక శ్రీశాంత్ ఏడ్చేశాడు.

ఈ ప్రోమో ఇప్పుడు హైలెట్ గా మారింది. శ్రీశాంత్ కి ప్రజల నుంచి కూడా మద్దతు రోజు రోజుకీ పెరుగుతోంది. బిగ్ బాస్ హౌజ్ లో శ్రీశాంత్ ఏడ్వడం ఇదేమీ మొదటిసారి కాదు. హౌస్ లో అడుగుపెట్టిన తొలి రోజుల్లో ఒకసారి.. ఆ తర్వాత హౌజ్ మెట్స్ తో తాను అనుభవించిన బాధల గురించి వివరిస్తూ.. మరోసారి ఏడ్చేశారు. 

PREV
click me!

Recommended Stories

విజేతని డిసైడ్ చేసే ఓటింగ్ లో బిగ్ ట్విస్ట్, ఇమ్ము కథ ముగిసినట్లేనా.. కళ్యాణ్, తనూజ లలో ఎవరు ముందంజ ?
Karthika Deepam 2 Today Episode: జ్యో, పారులకు దీప వార్నింగ్- వణికిపోయిన పారు- జ్యో ట్రాప్ లో కాశీ