బిగ్ బాస్ బ్యూటీపై యాసిడ్ దాడి చేస్తామని బెదిరింపులు!

Published : Jan 06, 2019, 04:12 PM IST
బిగ్ బాస్ బ్యూటీపై యాసిడ్ దాడి చేస్తామని బెదిరింపులు!

సారాంశం

ఇటీవల హిందీ బిగ్ బాస్ 12 సీజన్ పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ షో టైటిల్ విజేతగా శ్రీశాంత్ నిలుస్తారని చాలా మంది భావించారు.. కానీ నటి దీపిక కాకర్ టైటిల్ కొట్టేసింది.

ఇటీవల హిందీ బిగ్ బాస్ 12 సీజన్ పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ షో టైటిల్ విజేతగా శ్రీశాంత్ నిలుస్తారని చాలా మంది భావించారు.. కానీ నటి దీపిక కాకర్ టైటిల్ కొట్టేసింది. దీనిపై శ్రీశాంత్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టైటిల్ గెలిచిన దీపిక కాకర్ మీద, బిగ్ బాస్ టీమ్ మీద విరుచుకుపడుతున్నారు.

తెర వెనుక ఏదో గోల్ మాల్ చేసి శ్రీశాంత్ కి రావాల్సిన టైటిల్ ని దీపిక కి ఇచ్చారంటూ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో దీపికని టార్గెట్ చేస్తూ ఆమెపై విరుచుకుపడుతున్నారు. ఆమెపై యాసిడ్ దాడి చేస్తామని  బెదిరింపులకు పాల్పడుతున్నారు.

బెదిరింపులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ని తీసిన దీపిక అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సదరు వ్యక్తిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీపిక కాకర్, ఆమె భర్త షోయబ్ ఇబ్రహీం, శ్రీశాంత్, అతడి భార్య భువనేశ్వరి, ముంబై పోలీస్ ట్విట్టర్ అకౌంట్ లను ట్యాగ్ చేస్తూ దీపికపై బెదిరింపులకు పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలని కోరుతున్నారు.

యాసిడ్ పోస్తానని బెదిరించిన వ్యక్తి తన ట్వీట్ తొలగించినప్పటికీ అప్పటికీ దాన్ని స్క్రీన్ షాట్స్ తీసేశారు దీపిక అభిమానులు. మరి ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాలి!

PREV
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ప్రోమోతోనే దుమ్ములేపుతున్న `దేఖ్‌ లేంగే సాలా` సాంగ్‌.. పవన్‌ కళ్యాణ్‌ మేనియా స్టార్ట్
2025 Top 5 Heroes: 1000 కోట్లతో టాప్‌లో ఉన్న నటుడు ఇతనే.. రిషబ్‌, మోహన్‌ లాల్‌, విక్కీ, అక్షయ్‌లకు ఝలక్‌