`ఆర్‌ఆర్‌ఆర్‌` నుంచి మరో సర్‌ప్రైజ్‌ రెడీ.. ఈ సారి ఒకేతెరపై ఎన్టీఆర్‌, చరణ్‌?

Published : Jan 05, 2021, 02:30 PM IST
`ఆర్‌ఆర్‌ఆర్‌` నుంచి మరో సర్‌ప్రైజ్‌ రెడీ.. ఈ సారి ఒకేతెరపై ఎన్టీఆర్‌, చరణ్‌?

సారాంశం

`ఆర్‌ ఆర్‌ ఆర్‌` సినిమా షూటింగ్‌ని అక్టోబర్‌లో తిరిగి ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుతున్నారు. ఇప్పటికే సినిమాలోని ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ పాత్రలను పరిచయం చేశారు. ఇప్పుడు మరో సర్‌ప్రైజ్‌ ఇచ్చేందుకు రెడీ అవుతుంది చిత్ర బృందం. 

తెలుగులో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం `ఆర్‌ ఆర్‌ ఆర్‌`. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా, రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. డీవీవీ దానయ్య దీన్ని దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్‌ నటి అలియాభట్‌, బ్రిటీష్‌ నటి ఒలీవియా మోర్రీస్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సినిమాలో కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ నటిస్తున్నారు. 

`ఆర్‌ ఆర్‌ ఆర్‌` సినిమా షూటింగ్‌ని అక్టోబర్‌లో తిరిగి ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుతున్నారు. ఇప్పటికే సినిమాలోని ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ పాత్రలను పరిచయం చేశారు. ఈ మేరకు రెండు టీజర్‌ తరహా వీడియోలను విడుదల చేశారు. అవి ఆడియెన్స్ ని, ఇద్దరు హీరోల అభిమానులను మెప్పించడంతోపాటు సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. 

ఇప్పుడు మరో సర్‌ప్రైజ్‌ ఇచ్చేందుకు రెడీ అవుతుంది చిత్ర బృందం. అయితే సంక్రాంతికి `ఆర్‌ ఆర్‌ ఆర్‌` నుంచి ట్రీట్‌ ఏమీ ఉండబోదట. కానీ రిపబ్లిక్‌ డే సందర్భంగా భారీ సర్‌ప్రైజ్‌ ఇవ్వాలని రాజమౌళి టీమ్‌ భావిస్తుందట. సినిమాకి చెందిన ఓ స్పెషల్‌ వీడియోని విడుదల చేయాలని భావిస్తున్నారట. ఇందులో ఇద్దరు హీరోలు కనిపించనున్నట్టు తెలుస్తుంది. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ కలిసి ఉండేలా స్పెషల్‌ వీడియోని కట్‌ చేస్తున్నారట. 

ఇంకా `ఆర్‌ ఆర్‌ ఆర్‌` అభిమానులను సర్‌ప్రైజ్‌ చేసే అంశమేంటంటే? చిరంజీవి వాయిస్‌ ఓవర్‌ చెప్పబోతున్నారట. చిరు వాయిస్‌ ఓవర్‌తో ఈ వీడియోని విడుదల చేయబోతున్నట్టు సమాచారం. అలాగే హిందీలో అమిర్‌ ఖాన్‌ వాయిస్‌తో వీడియోని రిలీజ్‌ చేయబోతున్నారని, ఇతర భాషలకు చెందిన బిగ్‌ స్టార్‌ ఒకరు వాయిస్‌ ఓవర్‌ చెప్పబోతున్నట్టు టాక్‌. కేవలం వీడియోలకే కాదు, సినిమాలో కూడా ఈ బిగ్‌ స్టార్స్ వాయిస్‌ ఓవర్‌ ఉంటుందని తెలుస్తుంది. ఇది పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న విషయం తెలిసిందే. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..