అల్లు అర్జున్ AAA సినిమాస్ లో బిగ్ సర్ప్రైజ్.. ఇన్ని ప్రత్యేకతలా, బన్నీ స్టయిలే వేరు..

By Asianet News  |  First Published Mar 8, 2023, 11:46 AM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రతి అంశంలో తన ప్రత్యేకత చూపిస్తుంటారు. తాను చేసే చిత్రాల్లో వైవిధ్యం కోరుకుంటారు. అలా చేసిన చిత్రమే పుష్ప. ఈ చిత్రంలో బన్నీ యాటిట్యూడ్, స్టైల్ కి దేశం మొత్తం ఫిదా అయింది. 


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రతి అంశంలో తన ప్రత్యేకత చూపిస్తుంటారు. తాను చేసే చిత్రాల్లో వైవిధ్యం కోరుకుంటారు. అలా చేసిన చిత్రమే పుష్ప. ఈ చిత్రంలో బన్నీ యాటిట్యూడ్, స్టైల్ కి దేశం మొత్తం ఫిదా అయింది. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అల్లు అర్జున్ సినిమాల్లో మాత్రమే కాదు బిజినెస్ పరంగా కూడా ముందు వరుసలో ఉంటారు. 

అల్లు అర్జున్ ఏసియన్ సినిమాస్ సునీల్ నారంగ్ తో చేతులు కలిపి ఓ భారీ మల్టిఫ్లెక్స్ ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో గతంలో సత్యం థియేటర్ ఉన్న చోట ఈ మల్టిఫ్లెక్స్ తెరకెక్కుతోంది. మహేష్ బాబు ఏఎంబి సినిమా తరహాలో ఈ మల్టిఫ్లెక్స్ కి ఏషియన్ అల్లు అర్జున్ (AAA) సినిమాస్ అని నామకరణం చేశారు. ప్రేక్షకులని అబ్బుర పరిచే విధంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో AAA సినిమాస్ రూపుదిద్దుకుంటోంది. 

Latest Videos

ఈ మల్టిఫ్లెక్స్ గురించి ఆశ్చర్యపరిచే విశేషాలు బయటకి వస్తున్నాయి. రెండు మూడు నెలల్లో AAA సినిమాస్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ మల్టిఫ్లెక్స్ ప్రత్యేకతలు గమనిస్తే.. అల్లు అర్జున్ సిగ్నేచర్ AA లోగోని ప్రత్యేకంగా డిజైన్ చేశారట. అలాగే అల్లు అర్జున్ స్టాట్యూ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతే కాదు బన్నీ వర్చువల్ ఇమేజ్ ని కూడా ఏర్పాటు చేస్తున్నారట. 

ఫ్యాన్స్ ఎదురుగా నిలబడితే బన్నీ వర్చువల్ ఇమేజ్ రియాక్ట్ అయ్యే విధంగా ఉంటుందట. సీటింగ్ అత్యంత విలాసవంతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మల్టిఫ్లెక్స్ లోని స్క్రీన్స్ లో ఒక స్క్రీన్ ని ఫుల్ హెచ్ డి ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఏ స్క్రీన్ ప్రొజెక్టర్ అవసరం లేకుండా అబ్బురపరిచే హెచ్ డి క్వాలిటీతో మూవీ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతోంది. ఓవరాల్ గా ఏఎంబి సినిమాస్ ని మించే స్థాయిలో AAA సినిమాస్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ మల్టిఫ్లెక్స్ ఓపెనింగ్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 

 

click me!