అమెజాన్ ప్రైమ్ కి నిర్మాతల షాక్!

By Udaya DFirst Published Mar 21, 2019, 2:22 PM IST
Highlights

గత కొంతకాలంగా డిజిటల్ సినిమాలలో సత్తా చాటుతోంది అమెజాన్ ప్రైమ్. కొద్దిరోజులుగా దీని స్పీడ్ మరీ ఎక్కువైంది. ఇప్పుడు ఆ స్పీడ్ కి బ్రేకులు పడనున్నాయా..? అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. 

గత కొంతకాలంగా డిజిటల్ సినిమాలలో సత్తా చాటుతోంది అమెజాన్ ప్రైమ్. కొద్దిరోజులుగా దీని స్పీడ్ మరీ ఎక్కువైంది. ఇప్పుడు ఆ స్పీడ్ కి బ్రేకులు పడనున్నాయా..? అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

దీనికి కారణంగా ఈ మధ్యకాలంలో విడుదలైన చాలా సినిమాలు థియేటర్ లో ఉండగానే.. అమెజాన్ ప్రైమ్ లో ప్రత్యక్షమయ్యాయి. దీంతో సినిమా చూడాలనుకునే ప్రేక్షకుడు కూడా అమెజాన్ లో వచ్చేస్తుంది కదా.. అప్పుడు చూద్దాం అంటూ ధీమాగా ఉంటున్నారు. దీంతో సినిమా థియేట్రికల్ బిజినెస్ కి పెద్ద దెబ్బ పడుతుంది.

ఇకపై ఏ సినిమా అయినా.. రిలీజ్ అయిన ఎనిమిది వారాల్లోపు డిజిటల్ స్ట్రీమింగ్ లో పెట్టడానికి వీల్లేదని తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేదు. అన్ని సినిమాలకు ఒకటే రూల్. ఆఖరికి డబ్బింగ్ సినిమాల విషయంలో కూడా ఈ రూల్ ఫాలో కావాల్సిందే. ఏప్రిల్ 1 నుండి ఈ రూల్ అమలులోకి వస్తుంది.

ఈ విధానం కేవలం అమెజాన్ ప్రైమ్ వీడియోలకు మాత్రమే కాదు అన్ని డిజిటల్ స్ట్రీమింగ్ వేదికలకు ఇదే నియమం వర్తిస్తుంది. ఇకపై సినిమా డిజిటల్ రైట్స్ అమ్మే నిర్మాతలు ఈ షరతు మీదే సినిమాను విక్రయించాలి. లేదంటే చర్యలు తప్పవని తెలుస్తోంది. 

click me!