బన్నీ సినిమా కోసం రూ.కోటి విలువచేసే లైబ్రరీ

Published : Sep 15, 2017, 05:47 PM ISTUpdated : Mar 26, 2018, 12:00 AM IST
బన్నీ సినిమా కోసం రూ.కోటి విలువచేసే లైబ్రరీ

సారాంశం

‘నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా’ అంటున్న అల్లు అర్జున్ వక్కంతం దర్శకత్తంలో తెరకెక్కుతున్న ‘నా పేరు సూర్య...’ కీలక పాత్రల్లో కోలివుడ్ స్టార్స్ శరత్ కుమార్, యాక్షన్ కింగ్ అర్జున్

సినిమాల కోసం కోట్లు ఖర్చు పెట్టి భారీ సెట్టింగులు వేస్తుంటారన్న విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా కోసం కూడా ఓ భారీ సెట్టింగ్ వేశారట. వక్కంతం వంశీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం ‘ నాపేరు సూర్య- నా ఇల్లు ఇండియా’. ఈ సినిమాలో కోలివుడ్ స్టార్స్ యాక్షన్ కింగ్ అర్జున్, శరత్ కుమార్ లు ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు.

 

ఈ ‘నాపేరు...’ కోసం ఓ లైబ్రరీ కావాల్సి వచ్చిందట. దీంతో రూ.కోటి ఖర్చు చేసి మరీ లైబ్రరీ సెట్టింగ్ వేశారట. అందులో సినిమాలోని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్లు టాక్. శరవేగంగా షూటింగ్  పూర్తి చేసుకుంటున్న ఈ సినిమాని 2018, ఏప్రిల్ 27న విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో బన్నీ గెటప్, డైలాగ్ డెలవరీ కొత్తగా ఉంటాయని చెబుతోంది చిత్రబృందం.

 

దువ్వాడ జగన్నాథం సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో ఈ సినిమాపై  అల్లు అర్జున్ పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

PREV
click me!

Recommended Stories

Karan Johar: జాన్వీలా యాక్టర్లు ఏజెన్సీలు ఎందుకు మారుస్తారు? అసలు విషయం చెప్పిన కరణ్
రాజమౌళి సినిమాలని రీమేక్ చేస్తే అన్నీ సూపర్ హిట్లే.. అది మాత్రం ఎందుకు అట్టర్ ఫ్లాప్ అయ్యిందో తెలుసా ?