సంక్రాంతి బాక్స్ ఆఫీస్ ఫైట్.. గెలిచేదెవరు?

Published : Jan 02, 2019, 03:32 PM IST
సంక్రాంతి బాక్స్ ఆఫీస్ ఫైట్.. గెలిచేదెవరు?

సారాంశం

సంక్రాంతి అనగానే కుటుంబ సభ్యులంతా ఒకే చోట కలుసుకుంటే ఆ వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక పండగలో సినిమాలు కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి.

సంక్రాంతి అనగానే కుటుంబ సభ్యులంతా ఒకే చోట కలుసుకుంటే ఆ వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక పండగలో సినిమాలు కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. అందరూ కలిసి ఒక మంచి సినీమా చుస్తే ఆ కిక్కే వేరు. 2019 సంక్రాంతిని పెద్ద సినిమాలు టార్గెట్ చేశాయి. 

ఒక్కొక్కరు ఒక్కో జానర్ తో రాబోతున్నారు. 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు గ్యాప్  లేకుండా 4 డిఫరెంట్ జానర్ ఫిలిమ్స్ రాబోతున్నాయి. మొదట 9న ఎన్టీఆర్  కథానాయకుడు రాబోతోంది. బాలకృష్ణ నటించిన ఈ సినిమా ఎన్టీఆర్ బయోపిక్ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక 10వ తేదీ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ పేట ద్వారా రాబోతున్నాడు. 

ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫుల్ యాక్షన్ లోడ్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. బోయపాటి దర్శకత్వంలో సినిమా తెరకెక్కడంతో మాస్ ఆడియెన్స్ ఈ సినిమాపై గట్టిగానే నమ్మకం పెట్టుకున్నారు. ఇక చివరగా 12వ తేదీ వెంకటేష్ - వరుణ్ తేజ్ మల్టీస్టారర్ F2 - సంక్రాంతి అల్లుళ్లు గా బాక్స్ ఆఫీస్ పోటీలో ఉన్నారు. 

కామెడీ ఎంటర్టైనర్ గా సినిమా రూపొందడంతో చాలా వరకు F2 సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. మొత్తంగా ఈ సంక్రాంతికి పెద్ద సినిమాల మధ్య బాక్స్ ఆఫీస్ ఫైట్ రసవత్తరంగా మారింది. అన్ని సినిమాలు స్థాయికి తగ్గట్టుగా రిలీజ్ అవుతున్నాయి. మరి ఈ ఫైట్ లో ఎవరు గెలుస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. 

PREV
click me!

Recommended Stories

Naga Vamsi: సంక్రాంతి సినిమాల పోటీపై నిర్మాత నాగవంశీ హాట్‌ కామెంట్‌.. `అనగనగా ఒక రాజు` ఎందుకు స్పెషల్‌ అంటే
The Raja Saab రిజల్ట్ ని ప్రభాస్‌ని ముందే ఊహించాడా? మారుతితో ఏం చెప్పాడంటే.. ది రాజా సాబ్‌ 2 అప్‌డేట్‌